Monday, March 23, 2026 03:37 PM
Monday, March 23, 2026 03:37 PM

తిరుమల పర్యటనపై రాజకీయాలు.. మీరు మారరా..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనపై తొలిసారిగా లేనిపోని విమర్శలను లేవనెత్తు తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల, అభిమాన మీడియా. నిజానికి చంద్రబాబు నాయుడు తిరుమల వెళ్ళటం, సకుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవటం ఇది మొదటిసారి కాదు. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తిరుమల వెళ్తున్నట్లు, నారావారి కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఆయనే లేకపోతే తాను లేను అని ఎన్నోసార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తుండగా అలిపిరి దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో తాను బతికి బయటపడటానికి స్వామి దయ కారణమని.. తనకు స్వామి పునర్జన్మ ప్రసాదించారని చంద్రబాబు శ్రీవారిపై తనకున్న నమ్మకాన్ని, భక్తి భావాన్ని ప్రకటించారు.

Also Read : ఏపీలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ కలకలం..!

పదవిలో ఉన్నా లేకున్నా చంద్రబాబు కుటుంబం ఎన్నోసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంది. చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించి మొక్కలు చెల్లించుకోవటం చంద్రబాబు కుటుంబ ఆచారం. 2015 నుంచి ప్రతి ఏటా మార్చి 21వ తేదీన టీటీడీ అన్న ప్రసాదం కోసం విరాళం ఇస్తున్నారు. 2015లో రూ.20 లక్షలు ఇవ్వగా.. అది ఇప్పుడు రూ.44 లక్షలకు చేరుకుంది. ఇలా ఇప్పటి వరకు 12 ఏళ్లకు కలిపి మొత్తం రూ.3.65 కోట్లు విరాళం రూపంలో ఇచ్చారు. అలాగే ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించి, అక్కడే తినేసి వెళ్ళటం చంద్రబాబు కుటుంబ ప్రతి ఏటా చేస్తున్న పని.

చంద్రబాబు తిరుమల పర్యటనపైన ఏపీ ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవు. ఆయన కుటుంబం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతగా ఆరాధిస్తుందో అందరికీ తెలుసు. పదవిలో ఉన్న లేకున్నా ఆయన తిరుమల వచ్చిన ప్రతిసారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే సాధారణ భక్తుల మార్గంలో ఆలయంలో ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారు. అంతే తప్ప అవకాశం ఉన్నప్పటికీ ముఖద్వారం నుంచి ఇప్పటివరకు ఒకసారి కూడా లోనికి వెళ్ళలేదు. ఎంత పెద్ద పదవిలో ఉన్న తాను స్వామి వారి భక్తుడిని అని చంద్రబాబు నాయుడు బహిరంగంగానే చెప్పారు. ఈ ఏడాది కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే ఆలయంలోనికి ప్రవేశించిన చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా.. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఆ తర్వాత మాఢ వీధుల గుండా నడుచుకుంటూ శ్రీ తరిగొండ వెంగమాంబ భవనం చేరుకొని భక్తులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పర్యటనపైనే వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా బ్యాచ్ సైతం గగ్గోలు పెడుతోంది. తిరుమలలో చంద్రబాబు పిఆర్ స్టంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతుంది. చంద్రబాబు కోసం సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టారని, అసలు తిరుమలలో బర్త్ డే వేడుకలు ఏమిటి అని, ప్రసాదం స్పూన్ తో తిన్నారు అని, గర్భగుడిలోనే దేవాన్ష్ ఫోటో షూట్ అని, దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల్లో లోకేష్ సతీమణి బ్రహ్మణి సహా బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఎందుకు కనిపించలేదు అంటూ.. తలతిక్క ప్రశ్నలకు ఉన్న పరువు కాస్త బజారున పడేసుకుంటున్నారు.

Also Read : ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

“మహాద్వారం ద్వారా వెళ్లి ఉంటే 20 నిమిషాల్లో అయ్యే దర్శనం… సామాన్య భక్తులకు ఒక్క ఇబ్బంది ఉండేది కాదు! కానీ ఏమైంది?.. పీఆర్ కోసం చంద్రబాబు – లోకేష్ ఇద్దరూ బిజీ. వైకుంఠ ద్వారం దగ్గర సామాన్య భక్తులను ఆపేసి, మీరు మాత్రం నిదానంలో నడుచుకుంటూ, కెమెరాల ముందు ఫోజులు… ఫొటోలు… వీడియోలు… ఏదో దేశాన్ని కాపాడినట్టు బిల్డప్! భక్తుల సమయం, కష్టాలు, బాధలు, సామాన్య భక్తుల్ని ఆపి మీ పీఆర్ కోసం స్టేజ్ సెట్ చేసుకోవడం ఇదే మీ పాలన అసలు రూపం!” అంటూ అత్యంత జుగుప్సాకరమైన, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంది. ఇక మరో అడుగు ముందుకు వేసిన వైసీపీ పెయిడ్ బ్యాచ్ “గర్భ గుడిలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ఫోటో షూట్!.. ఫోటో షూట్ బ్యాన్ చేశాం అంటూ ప్రచారం.. ఇప్పుడు ఏకంగా శ్రీవారి ఆలయంలో లోపలే ఫోటో షూటింగ్!” అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా లేనిపోని అపోహలు సృష్టించేందుకు నానాపాట్లు పడుతోంది.

ఆలయ గర్భగుడికి వెండి వాకిలి బయట ఉన్న ధ్వజస్తంభానికి మధ్య తేడా కూడా తెలియని వైసీపీ మీడియాను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ధ్వజస్తంభం దగ్గర వీవీఐపీలకు ఫోటో తీయటం అనేది టీటీడీ ఇదే మొదటిసారి చేయలేదు. రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చిన సందర్భాలలో ధ్వజస్తంభం వరకు వారితో పాటు టీటీడీ అధికారిక ఎస్వీబీసీ ఛానల్ కెమెరామెన్లు వెళ్లి, ఫోటోలు తీయటం మొదటి నుంచి ఉన్నది. గతంలో వైఎస్ఆర్, జగన్ తిరుమల అధికారిక పర్యటనలో కూడా ఇలాగే జరిగింది. జగన్ ఏకంగా తులాభారం ఇస్తున్న వీడియోని ఆలయంలో తీశారు. అప్పుడు జరగని అపచారం ఇప్పుడు ఎలా జరిగింది అనేది సాధారణ భక్తుల సూటి ప్రశ్న. ఆలయంలోనే “జగన్ రక్షక” అంటూ టీటీడీ చైర్మన్ భార్య అరిచిన వీడియో అప్పుడు తప్పు కాదు. ఇప్పుడు అన్న ప్రసాదం వడ్డిస్తే మాత్రం తప్పు ఎలా అవుతుంది అని నిలదీస్తున్నారు.

Also Read : ట్రంప్ భయానికి కారణం ఇరాన్ షాక్ ట్రీట్‌మెంటేనా..?

ఇక ఈ పర్యటనలో బ్రాహ్మణి ఎందుకు పాల్గొనలేదు అనేవాటికి భక్తులే ఘాటుగా జవాబు ఇస్తున్నారు. హిందూ ధర్మంలో గుడికి రాకపోవటం అనేది కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయని, మహిళల శారీరక సమస్యలు కూడా తెలీదా అంటూ ఛీ కొడుతున్నారు. “జగన్ కుటుంబంలో మాదిరి చంద్రబాబు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు అని.. నాలుగు రోజుల క్రితమే దేవాన్ష్ పంచల పండుగలో అందరూ కలిసి పాల్గొన్న విషయం అప్పుడే మర్చిపోయారా” అని వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన విషయం గుర్తులేదు అంటే అల్జీమర్స్ వ్యాధి వచ్చిందేమో ఒకసారి వైద్యులను సంప్రదించాలి అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై సెటైర్లు పేలుతున్నాయి. అధికారం కోసం తిరుమలను రాజకీయాల్లోకి లాగి శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించే కుట్రలు ఇకనైనా మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. తిరుమల విషయంలో రాజకీయాలు చేయటంలో మీరు మారరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

పోల్స్