Friday, June 19, 2026 07:05 PM
Friday, June 19, 2026 07:05 PM

ఆస్తుల నిజం జగన్ కు, దేవుడుకి తెలుసు: విజయమ్మ

గత నాలుగేళ్ల నుంచి వైఎస్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు ఇప్పుడు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒక్కో వివాదం రోజు రోజుకి తీవ్రమవుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి మరణం వ్యవహారంతో పాటుగా పలు కీలక విషయాలు ఇక్కడ సంచలనంగా మారుతున్నాయి. తాజాగా వైఎస్ విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేసారు. 2009లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనన్న వైఎస్ విజయమ్మ, ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదని తేల్చేసారు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్దేశమని స్పష్టం చేసారు విజయమ్మ.

Also Read : తగ్గని పిన్నెల్లి వాయిస్.. ఈ వార్నింగ్ ఎవరికి..?

ఇది ఆయన ఆదేశం కూడానన్న ఆమె.. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని, అందుకే జగన్ ఎంఓయూ రాశాడన్నారు. నిజానికి తనకు తక్కువే రాశాడని విజయమ్మ ఆరోపించారు. సరస్వతి సిమెంట్ తో సహా ఎంఓయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనన్నారు. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే అనీ స్పష్టం చేసారు.

Also Read : మదనపల్లె దహనం కేసులో సంచలన విషయాలు.. !

ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడన్న ఆమె, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నానని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు చెప్తున్న.. షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్‌ కు కూడా ఇచ్చారని, అది ఆస్తి పంపకం కాదన్నారు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసని సంచలన వ్యాఖ్యలు చేసారు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు ? అని నిలదీశారు. మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయమన్న ఆమె, అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను అంటూ విజ్ఞప్తి చేసారు. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా అంటూ.. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్