Thursday, September 17, 2026 05:21 PM
Thursday, September 17, 2026 05:21 PM

24 గంటల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..!

ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. కీలకమైన ఎన్నికల హామీల విషయంలో సర్కార్ తీసుకుంటున్న చర్యలపై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ముస్లిం ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. నిన్న జరిగిన ఇఫ్తార్ విందులో ఇమామ్‌ లు, మౌజన్‌ ల బకాయిలను వెంటనే చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని గంటల్లో నిలబెట్టుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయికి చేరడానికి రోజులు పడుతుంటాయి.

Also Read : రోహిత్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్.. సస్పెండ్ ఖాయమే..?

కానీ, ముఖ్యమంత్రి ఆదేశించిన కేవలం కొన్ని గంటల్లోనే రూ. 45 కోట్లు విడుదల కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు స్పీడ్ గవర్నెన్స్ కు ఉదాహరణ అంటూ సోషల్ మీడియాలో ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. గత ఆరు నెలలుగా పెండింగ్‌ లో ఉన్న గౌరవ వేతనాలను రంజాన్ పండుగ కంటే ముందే ఒకేసారి క్లియర్ చేయడం ద్వారా 10,000 మంది కుటుంబాలకు అండగా నిలబడింది రాష్ట్ర సర్కార్. 5,000 మంది ఇమామ్‌ లకు రూ. 30 కోట్లు, 5,000 మంది మౌజన్‌ లకు రూ. 15 కోట్లు చెల్లిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Also Read : వన్డేలపై సూర్య కుమార్ సంచలన కామెంట్స్..!

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ కావడంతో ముస్లిం వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో బకాయిల కోసం ఇబ్బందులు పడ్డ ముస్లిం మత పెద్దలు, నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తమ కష్టాలు తీరడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు నిర్వహించే వారికి ఈ గౌరవ వేతనం ఒక గొప్ప ఊరటగా చెప్పవచ్చు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకంగా వర్ణిస్తూ ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్