Monday, March 9, 2026 06:13 PM
Monday, March 9, 2026 06:13 PM

పడి లేచిన కెరటం.. పర్మినెంట్ ఓపెనర్ అయిపోయాడు..!

ఏ రంగంలో అయినా వచ్చిన అవకాశాలను వాడుకునే వాళ్ళకే డామినేషన్ ఉంటుంది. కెరీర్ పరంగా ఇబ్బందులు ఉండవు. ఎత్తుపల్లాలు సహజమే అయినా.. పల్లాలు వచ్చినప్పుడు నిలబడితే ఉండే లెవెల్ వేరు. ఈ విషయంలో టీం ఇండియా స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ అన్ని విధాలుగా నిరూపించుకున్నాడు. 11 ఏళ్ళ క్రితం జట్టులో అడుగుపెట్టినా ఇప్పటి వరకు సంజుకి సరైన గుర్తింపు రాలేదు. వచ్చిన అవకాశాలను కొన్ని సార్లు వాడుకున్నా.. మరికొన్ని సార్లు మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చాడు.

Also Read : ఆ ఇద్దరికే గంభీర్ క్రెడిట్.. ఎవరూ ఊహించని పేర్లు..!

చివరకు శుభమన్ గిల్ కారణంగా సంజు సామ్సన్ కు..ప్రాధాన్యత తగ్గింది. ఓపెనర్ గా మూడు సెంచరీలు చేసినా సంజుకి మాత్రం మొండిచేయి దక్కింది. వాటర్ బాయ్ గా మారిపోయాడు. టి20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన.. న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ లో సంజుకి అవకాశాలు వచ్చాయి. అయినా సరే ప్రూవ్ చేసుకోలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. టి20 ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ లలో కూడా ప్రదర్శన అంత గొప్పగా కనపడలేదు. దీనితో సంజుని పక్కన పెట్టాలనే డిమాండ్ లు కూడా వచ్చాయి.

కాని సూపర్ 8 స్టేజ్ లో చివరి మ్యాచ్ నుంచి భారత్ కు ప్రతీ మ్యాచ్ కీలకం అయింది. అప్పుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సంజు సామ్సన్. విండీస్ పై 97 పరుగులతో భారత్ ను సెమీస్ కు తీసుకువెళ్ళిన సంజు సామ్సన్.. ఆ తర్వాత.. సెమీస్ లో ఇంగ్లాండ్ పై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో సంజు ఆడిన ఇన్నింగ్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇలా కీలక మ్యాచ్ లలో సంజు ఆడిన ఆటకు విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు.

Also Read : ఆఫ్ ది రికార్డు.. ఇంతకూ ఆయన మతమేంటి..?

న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ లో ఫెయిల్ కావడంతో సంజు కష్టమే అనుకున్న వాళ్లకు.. అతను ఆ తర్వాతి నుంచి తనను తాను నిరూపించుకున్న విధానం మాత్రం వేరే స్థాయిలో ఉందనే చెప్పాలి. ఒకప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాగే పట్టుదలగా ఆడేవారు. డూ ఆర్ డై మ్యాచ్ లలో వాళ్ళ ప్రదర్శనే వాళ్ల కెరీర్ కు హెల్ప్ అయింది. ఇప్పుడు సంజు సామ్సన్ కు కూడా అదే హెల్ప్ అయింది. ఇక జట్టులో అతని స్థానాన్ని కదిలించలేని పరిస్థితి క్రియేట్ చేసి.. టి20 లలో భారత్ కు పర్మినెంట్ ఓపెనర్ గా మారిపోయాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తమిళనాట ఏపీ ఫార్ములా.....

తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపధ్యంలో...

లక్ష్మీ దుర్గ ఎక్కడ.....

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు...

పుకార్లకు బ్రేక్ వేసేది...

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఇంకా...

చంద్రబాబు ఖాతాలో మరో...

పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ఏపీ సిఎం...

బ్రేకింగ్: బెజవాడ బస్టాండ్...

బెజవాడ బస్టాండ్.. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్....

ఫైనల్ మ్యాచ్‌కు జగన్.....

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్...

పోల్స్