Friday, May 1, 2026 08:52 AM
Friday, May 1, 2026 08:52 AM

ఇదేం క్రేజ్ దురంధర్.. రిలీజ్ కు ముందే రికార్డులు..!

గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. దురంధర్ సెకండ్ పార్ట్ కు వస్తున్న క్రేజ్ ఇప్పుడు ఇండియన్ సినిమా షేక్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ కు పిచ్చ క్రేజ్ రావడంతో రెండవ పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముగ్గురు నలుగురు కంటే పెద్దగా స్టార్ లు లేని ఈ సినిమా రెండు పార్ట్ లకు అయిన బడ్జెట్ కూడా చాలా తక్కువ. కేవలం 160 నుంచి 180 కోట్లు మాత్రమే అయింది. మొదటి పార్ట్ కు 1400 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం ఓ సెన్సేషన్. మన తెలుగులో కూడా సినిమాకు భారీ బజ్ క్రియేట్ అయింది.

Also Read : వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..!

అందుకే సెకండ్ పార్ట్ ను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గత వారం సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత, ప్రివ్యూ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసారు మేకర్స్. మార్చ్ 18 కి అమ్ముతున్న ఈ టికెట్ ల కలెక్షన్స్ ఇప్పుడు ఎన్నో సినిమాల కలెక్షన్స్ రికార్డ్ లను బ్రేక్ చేసాయి. 24 గంటల్లోనే, బుక్‌ మైషోలో మాత్రమే 87 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మార్చి 9 ఉదయం నాటికి, ఈ సంఖ్య మరింతగా పెరిగి.. 1.5 లక్షలకు పైగా వెళ్ళింది. చివరకు 2 లక్షలకు పైగా టికెట్ లు అమ్ముడయ్యాయి.

Also Read : అమెరికాను ఆర్ధికంగా ముంచేస్తున్న ఇరాన్..!

సాక్‌ నిల్క్ లెక్కల ప్రకారం, ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇండియా అంతటా చూసుకుంటే.. 2.06 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 12.29 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా. ఈ కలెక్షన్‌ లో ఎక్కువ భాగం హిందీ వెర్షన్ నుంచి వచ్చినా.. ఈ సినిమాకు తమిళ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది. ప్రివ్యూ షోల కలెక్షన్స్ తమిళనాడులో 10 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి. బాలీవుడ్‌ లో ప్రీమియర్ షోల ద్వారా.. అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్: ది రివెంజ్’ రికార్డులు క్రియేట్ చేసింది. స్ట్రీ 2 సినిమా 10 కోట్ల మార్కును అధిగమించింది. ప్రీమియర్స్ ఇంకా 9 రోజుల సమయం ఉండటంతో.. వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్