Thursday, September 17, 2026 11:34 PM
Thursday, September 17, 2026 11:34 PM

అమెరికాను ఆర్ధికంగా ముంచేస్తున్న ఇరాన్..!

ఇజ్రాయిల్, అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం వారం రోజుల్లో ముగుస్తుందని అంచనా వేసిన అమెరికాకు ఇప్పుడు ఆర్ధికంగా చుక్కలు కనపడుతున్నాయి. తాజాగా ఇరాన్ దాడిలో అమెరికాకు చెందిన కీలక రాడార్ వ్యవస్థ నాశనం అయిపొయింది. గల్ఫ్‌లో అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను నిర్దేశించడంలో కీలకమైన 300 మిలియన్ల డాలర్ల రాడార్ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసిందని అమెరికా స్వయంగా ప్రకటన చేసింది. భవిష్యత్తులో దాడులను ఎదుర్కొనే విషయంలో ఈ ప్రాంతంలో ఇది తమకు పెద్ద దెబ్బగా అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

Also Read : గంభీర్ కెరీర్ వర్సెస్ ఒక్క మ్యాచ్..!

యుద్ధం ప్రారంభమైన రోజులలో జోర్డాన్‌ లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో US THAAD క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, దాని సహాయక పరికరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగింది. ముందు వచ్చిన ఈ వార్తలను అమెరికా ఖండించినా ఆ తర్వాత మాత్రం అంగీకరించింది. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ థింక్ ట్యాంక్ సేకరించిన డేటా ప్రకారం, జోర్డాన్‌లో రెండు ఇరాన్ దాడులు జరిగాయి. ఒకటి ఫిబ్రవరి 28న, మరొకటి మార్చి 3న జరిగాయి.

Also Read : ఫైనల్ మ్యాచ్‌కు జగన్.. దారి ఖర్చులు మావే..!

ఈ దాడి ఇప్పటి వరకు ఇరాన్ చేసిన అత్యంత విజయవంతమైన దాడిగా ఆయన పేర్కొన్నారు. అటు దుబాయ్, సౌదీలో కూడా అమెరికా రక్షణ వ్యవస్తలపైనే ఇరాన్ దాడులకు దిగుతోంది. AN/TPY-2 రాడార్ పనిచేయకపోవడంతో, క్షిపణిని అడ్డుకునే విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించే పేట్రియాట్ వ్యవస్థలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవస్థకు PAC-3 క్షిపణుల కొరత ఉంది. అటు ఇరాన్ డ్రోన్ ల దాడులతో అమెరికా తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటి వరక్కు 16 మిలియన్ డాలర్లను అమెరికా.. డ్రోన్ లను అడ్డుకునేందుకు ఖర్చు చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్