Friday, June 19, 2026 02:16 PM
Friday, June 19, 2026 02:16 PM

తమిళనాట ఏపీ ఫార్ములా.. పవన్ తో విజయ్ కు గాలం..?

తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపధ్యంలో మారుతోన్న రాజకీయ పరిణామాలు కాస్త ఆసక్తిని రేపుతున్నాయి. తమిళనాడులో కీలక పార్టీల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరుకోగా.. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి, ఎన్నికల బరిలో నిలుస్తోన్న.. టీవీకే అధినేత విజయ్ విషయంలో బిజెపి కాస్త గేమ్ మార్చినట్లు కనపడుతోంది. ఆయనను ఎన్డియే కూటమిలోకి తీసుకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : ఇదేం క్రేజ్ దురంధర్.. రిలీజ్ కు ముందే రికార్డులు..!

ప్రధాన మీడియాలో దీనిపై అనేక ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఏపీ ఫార్ములాను తమిళనాట అమలు చేయాలంటే.. పవన్ కళ్యాణ్ మాదిరిగా బలం ఉన్న విజయ్ కావాలని బిజెపి భావిస్తోంది. అందుకే అధికారంలోకి వస్తే ఆయనకు డిప్యూటి సిఎం పదవి ఇవ్వాలని బిజెపి భావిస్తోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్.. విజయ్ తో ఫోన్ లో కూడా మాట్లాడినట్లు సమాచారం. కొంగునాడు, కోయంబత్తూరు, మదురై సమీపంలోని జిల్లాల్లో విజయ్ కు బలం ఉంది.

Also Read : లక్ష్మీ దుర్గ ఎక్కడ.. పోలీసులకు నిజంగా తెలియదా..?

ఈ బలాన్ని వాడుకోవాలని భావిస్తోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు తో పాటుగా.. క్రీస్టియన్ ఓట్లు.. డిఎంకె వైపు వెళ్ళకుండా ఉండేలా, బిజెపి ప్లాన్ చేస్తోంది. అన్నాడిఎంకే నేతలు ఇప్పటికే విజయ్ ను పలుమార్లు కలిసినా, ఆయన అంతగా అంగీకరించలేదు. కానీ.. పోటీ మాత్రం తనకు, డిఎంకెకి అంటూ విజయ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కేంద్రం దూతగా పవన్ ను బిజెపి రంగంలోకి దించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్