Friday, June 19, 2026 01:27 PM
Friday, June 19, 2026 01:27 PM

పాక్ లో వరస్ట్ సిచ్యువేషన్.. అసలేం జరుగుతోంది..?

ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. అసలే ఆర్ధిక ఇబ్బందులతో నానా కష్టాలు పడుతున్న పాక్ ప్రభుత్వం, ప్రజలకు ఇప్పుడు యుద్ధం రూపంలో.. చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు రోజు రోజుకి పెరిగిపోవడంతో పాక్ ప్రజలలో భయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 55 పాకిస్తాన్ రూపాయలకు ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర చేరుకుంది. అటు డాలర్ మారకం విలువ కూడా భారీగా పెరగడంతో.. ఖర్చులు మరింతగా పెరిగిపోయాయి.

Also Read : అమెరికాను ఆర్ధికంగా ముంచేస్తున్న ఇరాన్..!

పాక్ ఎక్కువగా యూఏఈ, సౌదీ అరేబియా మీద చమురు కోసం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. ఇప్పుడు హార్మోజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో పాక్ లో చమురు నిల్వలు భారీగా పడిపోయాయి. కేవలం పది రోజులకు మాత్రమే పాక్ లో చమురు నిల్వలు ఉండనున్నాయి. ఇక ఆయిల్ రిఫైనరీలు ఓల్డ్ టెక్నాలజీతో నడవడంతో పాక్.. శుద్ధి చేసిన చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. హార్మోజ్ కారణంగా పాక్ లో ఈ నిల్వలు కూడా తగ్గిపోయాయి. దానికి తోడు వ్యాపారులు ఆయిల్ నిల్వ చేయడం కూడా ప్రభావం చూపుతోంది.

Also Read : ఆఫ్ ది రికార్డు.. ఇంతకూ ఆయన మతమేంటి..?

ఇదే సమయంలో, పాకిస్తాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సహకారం కూడా తగ్గింది. ఐఎంఎఫ్ నుంచి పాక్ రుణాలు తీసుకుంటుంది. దీని కారణంగా చమురుకి డిస్కౌంట్ రావడం అనేది కష్టం. అందుకే పెరుగుతున్న ధరల పెంపు ప్రజపై ఎక్కువగా పడుతోంది. ఇక పాక్ లో విద్యుత్ ఉత్పత్తి చమురు మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాగే పాక్ లో రవాణా వ్యవస్థ రైళ్ళ మీద కంటే ట్రక్కుల మీద ఆధారపడటంతో చమురు వాడకం ఎక్కువ. ఇప్పుడు ఇదే పాక్ కు తలనొప్పిగా మారింది. మరో పది రోజుల లోపు పాక్ కు చమురు వెళ్ళకపోతే రవాణా పూర్తిగా స్తంభించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

పోల్స్