Friday, June 19, 2026 04:31 PM
Friday, June 19, 2026 04:31 PM

బ్రేకింగ్: భారత్ కు ఘోర అవమానం

రష్యన్ ముడి చమురు కొనుగోలు అంశానికి సంబంధించి గత కొన్ని నెలలుగా భారత్ ను అమెరికా ఇబ్బంది పెడుతోన్న సంగతి తెలిసిందే. తమ ఆయిల్ ను భారత్ కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తున్న అమెరికా.. రష్యా ముడి చమురు కొనుగోలు చేసినందుకు గానూ.. సుంకాలు విధించింది. ఇక తాజాగా ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధం నేపధ్యంలో.. ప్రస్తుతం రవాణాలో.. అంటే జల మార్గాలపై ఉన్న ఉన్న చమురును కొనుగోలు చేయడానికి భారత్ కు ఇటీవల అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read : సత్యం, నమ్మకం.. వైసీపీ నోట వింత మాటలు..!

నిన్న ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు లైసెన్స్ జారీ చేసింది. వచ్చే నెల 3 వరకు ఈ అనుమతులు ఉంటాయి అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ శుక్రవారం ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారతీయులు చాలా మంచి నటులు అని.. తన స్వార్ధ ప్రయోజనాల కోసం భారత్ డ్రామా ఆడుతోందనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆగ్రహం కలిగిస్తున్నాయి.

Also Read : కేతిరెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం..?

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జల మార్గాల్లో.. వందల మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు ఉందని ఆయన వ్యాఖ్యానిస్తూ.. భారత్ రెండు వైపులా మాట్లాడుతోంది అంటూ కామెంట్ చేసారు. ఇప్పటికే.. మన డబ్బుతో మనం ఎక్కడ ఆయిల్ కొనుక్కోవాలో చెప్తున్న అమెరికా.. ఈ తరహాలో భారత్ ను అవమానించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భారత్ తన ప్రయోజనాల కోసం నిజాయితీ లేకుండా వ్యవహరిస్తుందని బీసెంట్ మాట్లాడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్