Tuesday, August 4, 2026 03:57 PM
Tuesday, August 4, 2026 03:57 PM

ఏఐ డీప్‌ఫేక్ కలకలం : మహిళ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసుల కేసు నమోదు!

సాంకేతికతను ఆసరాగా చేసుకుని మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్న సైబర్ నేరగాళ్లపై రాయదుర్గం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఒక మహిళా ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఘటన వివరాల్లోకి వెళితే:

రాయదుర్గం, వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే తాడేపల్లి ఇందులేఖ (52) అనే మహిళకు సంబంధించి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేసిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా వంటి విదేశాల నుంచే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ అకృత్యానికి పాల్పడుతున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read : సోషల్ మీడియా లీక్ వీరులు ఎవరు..?

టార్గెట్ చేసిన సోషల్ మీడియా ఛానళ్లు:

నేరగాళ్లు ఈ కింది ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అభ్యంతరకర కంటెంట్‌ను ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు:

*YouTube: దేశాభిమాని – ఏ ట్రూ ఇండియన్, ది న్యూస్ తెలుగు, రెడ్ టీవీ తెలుగు, జగనన్న కనెక్ట్స్, కిషోర్ టాక్స్.

*Instagram: టీమ్ ప్రశ్న, laughingyogi_official, ysj_shafi_7.

* Facebook: ysj2.0, తుని అసెంబ్లీ మీడియా మేటర్స్.

తీవ్ర మనస్తాపానికి గురైన కుటుంబం:

ఈ డీప్‌ఫేక్ వీడియోల వల్ల తన ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా, కుటుంబ సభ్యులందరూ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ సిహెచ్. వెంకన్న కేసు నమోదు చేశారు.

Also Read : ప్లీజ్.. అతన్ని రీప్లేస్ చేయండి..!

చట్టపరమైన చర్యలు:

నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 319, 335, 353 తో పాటు ఐటీ చట్టం (IT Act 2008) సెక్షన్లు 66C, 66D, 67 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (DI) టి. భూపతికి అప్పగించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

పోల్స్