Tuesday, November 3, 2026 01:56 PM
Tuesday, November 3, 2026 01:56 PM

ఈరోజు రాశి ఫలితాలు (03-03-2026)

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం 03-03-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి.

—————————————

వృషభం

సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

మిధునం

ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

—————————————

కర్కాటకం

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

—————————————

సింహం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

కన్య

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

—————————————

తుల

చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

—————————————

వృశ్చికం

ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు.

—————————————

ధనస్సు

ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

—————————————

మకరం

కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది. గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

—————————————

కుంభం

మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

మీనం

దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: బెజవాడకు వరద...

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం...

సీఎం చంద్రబాబుకు అమిత్...

ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుపాన్లు వణికిస్తున్న నేపథ్యంలో...

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో...

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ కార్పొరేషన్...

మళ్లీ యాత్రల సమయం.....

"మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. ఎవరెన్ని యాత్రలు...

మాటల యుద్ధానికి తెర.....

ఎన్నికల సమరం ముగిసింది.. ఇక రాజకీయ...

తక్కువ పోలింగ్ కారణాలేమిటీ..?

తిరుపతి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో...

పోల్స్