విశ్వాంతరాళంలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమవుతున్న తరుణంలో, భూమిపై మానవ నిర్మిత విధ్వంసం విలయతాండవం చేస్తోంది. సరిగ్గా ఫిబ్రవరి 28, 2026న ఆకాశంలో ‘అష్టగ్రహ కూటమి’ (ఎనిమిది గ్రహాల అమరిక) ఏర్పడటం, అదే సమయంలో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారడం కేవలం యాదృచ్ఛికం కాదని అటు జ్యోతిష్య నిపుణులు, ఇటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఇరాన్‌లోని వ్యూహాత్మక అణు మరియు క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఊహించని రీతిలో ఏకకాలంలో “ఎనిమిది దేశా”లపై క్షిపణి దాడులకు తెగబడటం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అక్కడ భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
Also Read : ఢిల్లీలో స్వామిని యాక్టివేట్ చేసిన జగన్..?
కువైట్, ఖతార్ (అల్ ఉదైద్ బేస్), అబుదాబి మరియు సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జోర్డాన్ తన గగనతలాన్ని రక్షించుకునే క్రమంలో ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటోంది.
జ్యోతిష్య శాస్త్ర పరంగా చూస్తే, గ్రహాలు ఒకే వరుసలోకి రావడం (అష్టగ్రహ కూటమి) రాజకీయ అస్థిరతకు, యుద్ధాలకు సంకేతంగా భావిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం, ఇలాంటి అరుదైన గ్రహస్థితులు ఏర్పడినప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతుంది. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ఈ పోరు ఆ విశ్లేషణలకు అద్దం పడుతోంది.
ఈ యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు; ఇది ప్రపంచ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా బారెల్‌కు $100 మార్కును దాటింది. ఇది భారత్ వంటి చమురు దిగుమతి దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరాన్, ఇరాక్ మరియు ఇజ్రాయెల్ గగనతలాలు మూతపడటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విదేశీ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.
Also Read : కనిమొళికి, కవితకు జరిగిన న్యాయం.. అయేషా మీరాకు జరగలేదేం..?
గల్ఫ్ దేశాల్లో ఉన్న సుమారు లక్షల మంది భారతీయుల భద్రత ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ‘హై-అలెర్ట్’ ప్రకటించింది. యుద్ధం మరింత ముదిరితే అతిపెద్ద తరలింపు ప్రక్రియ చేపట్టాల్సి రావచ్చు. అష్టగ్రహ కూటమి శాంతికి సంకేతం కావాలని కోరుకున్నప్పటికీ, క్షిపణుల మోత ఆ ఆశలను అడియాశలు చేస్తోంది. అగ్రరాజ్యాల పంతం సామాన్య మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. దౌత్య మార్గాల ద్వారా తక్షణమే యుద్ధ విరమణ జరగకపోతే, ఈ ఫిబ్రవరి 28 మానవ చరిత్రలో ఒక విషాద అధ్యాయంగా మారవచ్చు.
మన దేశంలో కూడా ఇది ప్రభావం చూపుతోంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు పేలుడు సంభవించి 20 మంది మృతి చెందటం నిజంగా ఆందోళన కలిగించే అంశం. ఈ ఉపద్రవం కూడా అష్టగ్రహ కూటమి ప్రభావమే అంటూ జ్యోతిష్య పండితులు పెనుకొంటున్నారు.

