Thursday, September 17, 2026 11:38 PM
Thursday, September 17, 2026 11:38 PM

బ్రేకింగ్ : కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణా సంచా తయారీ కేంద్రం మరోసారి స్మశానంగా మారిపోయింది. తాజాగా కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామంలో ఓ బాణా సంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతతో చుట్టుప్రక్కల ఇళ్లు ధ్వంసం అయినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇటీవలి కాలంలో గోదావరి జిల్లాల్లో ఈ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read : కమిషనర్‌పై వేటు.. ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం..!

కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగడంతో పొగ కూడా కమ్మేసింది. దీనితో అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలను అదుపు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, అక్కడి పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉన్నాయి. కొందరి కాళ్ళు, చేతులు తెగిపడిన దృశ్యాలు, కొందరు మంటలతో హాహాకారాలు చేస్తోన్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి.

Also Read : టీం ఇండియాకు వరుస గండాలు..? విండీస్ ను తట్టుకుంటేనే..?

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నా సరే.. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం కనపడుతోంది. అయితే ఎంత మంది పని చేస్తున్నారు, చుట్టుపక్కల ఇళ్ళ వారు ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా..? గాయపడిన వారు ఎవరైనా ఉన్నారా అనే దానిపై అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో యజమాని కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్