Thursday, February 26, 2026 09:42 PM
Thursday, February 26, 2026 09:42 PM

మళ్లీ వస్తే.. వాళ్లకు చెప్పు దెబ్బలే..!

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. ఓడిన తర్వాత సైలెంట్‌గా పార్టీలు మారటం రాజకీయాల్లో సర్వ సాధారణం. వీరిలో కొంతమంది మాత్రం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే.. మళ్లీ వచ్చి చేరతారు. పైగా సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది అంటూ కబుర్లు చెబుతారు కూడా. ఇలాంటి వారు అన్ని పార్టీల్లో ఉన్నారు. వీరిలో ఊసరవెల్లితో పోలుస్తారు కూడా. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు వీరు కూడా పార్టీ జెండా, కండువా మారుస్తారని వారికా పేరు. ఇలాంటి వారు ప్రమాదకరమనేది రాజకీయ విశ్లేషకుల మాట.

Also Read : ఏపీ తెలుగు మహిళగా స్వామి శిష్యులు..!

2024 ఎన్నికల తర్వాత వైసీపీలో చాలా మంది నేతలు పార్టీలు మారారు. మాజీ మంత్రులు సైతం జగన్‌కు దూరమయ్యారు. బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో చాలా మందికి ఇప్పటి వరకు సరైన పదవులు దక్కలేదు కూడా. బాలినేని జనసేనలో చేరగా.. ఆళ్ల నాని టీడీపీలో చేరారు. అవంతిని మాత్రం అన్ని పార్టీలు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతల్లో కొందరు ఇలాంటి వారిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవకాశవాదులని కొందరంటుంటే.. మళ్లీ తిరిగి వచ్చేస్తారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పదవులు అనుభవించారని.. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఇలాంటి వారంతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంధుత్వం, స్నేహం అనే సాకుతో తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారని.. అలాంటి వారిని పార్టీ గేటు బయటే ఆపేయాలని.. అలాంటి వారిని చెప్పులతో తరిమి కొట్టాలని వెంకట్రామిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నీతి నియమం ఉండాలని.. ప్రజా సమస్యలపై నిజంగా పోరాటం చేసిన వారు ఏ పార్టీ వారైనా సరే.. పార్టీలో చేర్చుకుంటే తప్పు లేదన్నారు. “రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యం. వ్యక్తిత్వం లేని వారికి వైసీపీ తలుపులు శాశ్వతంగా మూసివేయబడతాయి” అని కేతిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.

Also Read : రష్మిక – విజయ్ పెళ్ళికి వెళ్ళిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే..!

అయితే కేతిరెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఓడిన జూపూడి ప్రభాకర్.. వెంటనే టీడీపీలో చేరారని.. మళ్లీ 2019 ఎన్నికల్లో వైసీపీలోకి వచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. అలాగే మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా 2014లో వైసీపీ తరఫున గెలిచిన తర్వాత వెంటనే టీడీపీలో చేరారని.. ఆ తర్వాత టీడీపీలోకి వస్తే.. జగన్ స్వయంగా కండువా కప్పిన విషయం కేతిరెడ్డి మర్చిపోయారేమో అని సెటైర్లు వేస్తున్నారు. వైసీపీలో ఇప్పుడున్న ఎంతోమంది నేతలకు గతంలో పార్టీలు మారిన చరిత్ర ఉందని.. ముందు వాళ్లను చెప్పులతో కొట్టాలని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నా భర్తను పరిచయం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల...

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

టార్గెట్ జనసేనాని అంటున్న...

ఏపీలో రెండు వరుస ఘటనలు ప్రభుత్వాన్ని...

తప్పు ఒకరిది.. కోర్టు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు...

మావో బాస్ కు...

మావోయిస్ట్ ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం...

మేడం గారు రెబల్.....

సాధారణంగా మహిళలు అనగానే రాత్రి సమయాల్లో...

పోల్స్