Thursday, September 17, 2026 08:51 PM
Thursday, September 17, 2026 08:51 PM

రిమోట్ వర్క్ చేస్తే హెచ్ 1 బీ రద్దు..?

అమెరికాలో ఉన్న విదేశీయులు ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో అర్ధం కాక తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఓ మహిళ తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుంది. రెడిట్ లో ఓ మహిళ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. హెచ్ 1 బీవీసాపై ఉన్న మహిళ.. జనవరిలో తన భర్తతో కలిసి అమెరికాకు తిరిగి వస్తుండగా అబుదాబి ప్రీక్లియరెన్స్ సర్వీస్ లో తన వీసా ఉన్నపళంగా రద్దు చేసినట్టు ఆవేదన వ్యక్తం చేసారు. తన కుమార్తె మొదటి పుట్టినరోజును జరుపుకోవడానికి నవంబర్‌లో భారత్ వెళ్ళినట్లు ఆమె పేర్కొంది.

Also Read : కూరగాయలు ఉప్పు నీళ్ళతో కడగడం మంచిదా..?

ఆమె పోస్ట్ ప్రకారం చూస్తే.. వీసా స్టాంపింగ్‌ లో ఎటువంటి సమస్యలు లేవు. ఆమె భర్తకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ లభించగా, ప్రీక్లియరెన్స్ ఎంక్వైరీ టైంలో ఆమెను ఆపినట్టు వాపోయారు సదరు మహిళ. భారత్ లో రెండు నెలల పాటు ఉన్నానని, అధికారికంగా సెలవు పెట్టి భారత్ వెళ్ళినట్లు పేర్కొన్న ఆమె.. భారత్ లో స్వల్ప కాలం పాటు వర్క్ చేసానని చెప్పడం గమనార్హం. ఆ తర్వాత ఆమెను రెండవ దశ చెకింగ్ కు పంపగా.. అక్కడ అధికారులు ఆమె లేబర్ కండిషన్ అప్లికేషన్ కింద భారత్ లో రిమోట్ వర్క్ చేయడానికి అనుమతులు అడిగారు.

Also Read : రష్మిక – విజయ్ పెళ్ళికి వెళ్ళిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే..!

ఆ డాక్యుమెంట్స్ తన వద్ద లేవని తెలిపింది. ఆమె కథనం ప్రకారం, అధికారులు ఆమెను భారత్ లో లిమిట్ కు మించి ఉన్నారని, భారత్ లో పని చేస్తూ అమెరికా కంపెనీ నుంచి జీతం తీసుకున్నారని, అందుకే మీ వీసా విత్ డ్రా చేస్తున్నామని అధికారులు తనతో చెప్పినట్టు ఆమె పేర్కొంది. మళ్ళీ వీసా అప్లై చేసుకోవాలని చెప్పినట్టు వాపోయింది. అయితే, ప్రస్తుతం వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌ లు అందుబాటులో లేవని, దీంతో తాను భారత్ లో ఉండిపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. భారత్ నుంచి రిమోట్‌ పద్దతిలో వర్క్ చేయడం చట్టవిరుద్ధం కాదని తన కంపెనీ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది సూచించినట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్