Tuesday, February 24, 2026 08:28 PM
Tuesday, February 24, 2026 08:28 PM

జగన్ ను తిట్టోద్దని పవన్ చెప్పారా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కల్తీ లడ్డు వ్యవహారంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గత పది రోజుల నుంచి శాసనమండలిలో ఈ వ్యవహారం ఒకరకంగా యుద్ధానికి దారితీసిందనే చెప్పాలి. బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇదే అంశంలో హెరిటేజ్ ను కూడా లాగే ప్రయత్నం చేస్తోంది. ఇలా వైసిపి.. హెరిటేజ్ పై విమర్శలు చేయడంతో టిడిపి ఒక రకంగా ఇబ్బంది పడుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. మంగళవారం దీనిపై లఘు చర్చను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.

Also Read : తిరుమల పవిత్రతకు ప్రత్యేక చట్టం: బాబు సంచలన నిర్ణయం

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే టీటీడీ బోర్డు మెంబర్లపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓ కామెంట్ చేశారని.. చర్చ సోషల్ మీడియాలో ఒక జరుగుతోంది. గత ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కి పాల్పడిందని, తాను దీక్ష కూడా చేశానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ.. తిరుమల లడ్డుకు వాడిన నెయ్యిలో.. అసలు నెయ్యి లేదని తేలినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వాధినేత వైయస్ జగన్ తప్పు చేశారని, తాను ఎక్కడా చెప్పలేదు అంటూ.. పవన్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు టిడిపి కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఇక్కడ పవన్ చేసిన కామెంట్స్ తో జగన్ పై కల్తీ లడ్డు వ్యవహారంలో విమర్శలు చేయవద్దనే హిట్.. పవన్ కళ్యాణ్ ఇచ్చారంటూ కొంతమంది మేధావులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : డైవర్స్ గురించి సమంతా సంచలన కామెంట్స్..!

అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి వైసిపి నేతలను.. అప్పటి టీటీడీ బోర్డు మెంబర్లను అధికారులను మాత్రమే తప్పుపట్టాలని పవన్ సూచించినట్లుగా కూడా చర్చ జరుగుతోంది. అయితే జగన్ ఆదేశాలు లేకుండా.. లడ్డు కల్తీ ఎలా చేస్తారని, పవిత్ర పుణ్యక్షేత్రంలో అంత దారుణానికి ఎలా ఒడిగడతారు అంటూ టిడిపి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యల విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఒక రకంగా సైలెంట్ గానే ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరి జాతకాలు బయటపెడతా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్...

ప్లాన్ ప్రకారమే అంతా.....

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

తిరుమల పవిత్రతకు ప్రత్యేక...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిరక్షణపై...

మరో వివాదంలో మోహన్...

గత రెండు మూడేళ్ళ నుంచి సినీ...

ఆఫ్ ది రికార్డు...

గుంటూరు మిర్చి యార్డు అంటే ఉమ్మడి...

క్రికెట్ లీగ్.. కెప్టెన్లు...

ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల్లో స్నేహపూర్వక వాతావరణం...

పోల్స్