Thursday, September 17, 2026 10:43 PM
Thursday, September 17, 2026 10:43 PM

అందరి జాతకాలు బయటపెడతా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన ట్వీట్ చేశారు. సునీల్ నాయక్‌ను బీహార్‌లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీకి తీసుకువచ్చేందుకు బీహార్ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ప్రస్తుతం ఏపీ పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అయితే ఈ సమయంలో సునీల్ నాయక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పెద్ద వైరల్‌గా మారింది. మరోసారి కులం ప్రస్తావన చేసిన సునీల్ నాయక్.. ఆర్‌ఆర్‌ఆర్ బెదిరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Also Read : మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ..!

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సస్పెండెడ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని ఫిర్యాదు దారుడు తనకు స్వయంగా ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. “కులం నా నేరమా?.. ST గా పుట్టడం పాపమా?.. చిన్న వర్గాల ప్రజలు ఉన్నత పదవులకు ఎదగడం కొంతమందికి భరించలేనిదిగా ఉందా?.. 2024లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు. నా పాత్ర లేని 2021 ఘటనలోకి నన్ను ఉద్దేశపూర్వకంగా లాగారు. తప్పుగా “వాంటెడ్” అని ముద్ర వేశారు. అప్పుడు నేను నిందితుడినా?.. ఫిర్యాదుదారుడు స్వయంగా నాకు ఫోన్ చేసి, నేను అతని కాల్ అందుకోకపోవడంతో నా స్నేహితుడి ద్వారా బెదిరింపు సందేశం పంపాడు. “మాజీ ముఖ్యమంత్రి, పీవీ సునీల్ కుమార్‌కు వ్యతిరేకంగా మాట్లాడండి.. లేదా మిమ్మల్ని నిందితుడిగా చేస్తారు.” అని బెదిరించినట్లుగా సునీల్ నాయక్ ఆరోపించారు.

ఆర్ఆర్ఆర్ కాల్ డేటా రికార్డులను బహిర్గతం చేస్తే, ఎంతమందిపై ఒత్తిడి, ప్రభావం చూపారో తెలుస్తుందని… ఈ కేసులో చాలా మందిని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని సునీల్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. “నేను ఐఐటీ మద్రాస్ నుండి పట్టభద్రుడయ్యాను. మెరిట్, కష్టపడి పనిచేయడం ద్వారా ఎస్టీ లంబాడి కోటా కింద ఐపీఎస్‌ స్థానాన్ని సంపాదించాను. నా పాఠశాల నుంచి టాపర్‌గా ఉన్నాను. ఆర్ఆర్ఆర్ కేసులో మొదట్లో నేను ఫిర్యాదుదారుడిని, ఇప్పుడు నాపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఇది నన్ను వలలో వేసుకోవడానికి చేసిన కుట్ర తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మా గిరిజనులకు గొంతు లేదని వారు భావిస్తున్నారు.

Also Read : తిరుమల పవిత్రతకు ప్రత్యేక చట్టం: బాబు సంచలన నిర్ణయం

ఏపీ నుంచి వచ్చిన అధికారులు నా తల్లి బయటకు వచ్చినప్పుడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించారు, ఆమెను అవమానించారు. కోట్ల విలువైన భారీ బంగారు బహుమతులపై ఎటువంటి విచారణ జరగలేదు.
ఇసుక, గ్రానైట్ మైనింగ్ రాకెట్లపై ఎటువంటి దర్యాప్తు లేదు. #HDFC మేనేజర్‌ను ముసుగుగా చేసుకుని జరిగిన భూ కుంభకోణాలపై ఎటువంటి దర్యాప్తు లేదు. కానీ ఒక లంబాడీ వ్యక్తి ఐపీఎస్ అధికారి కావడమే నా “నేరం”. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయం కోర్టు ముందు ఉంది. సరైన సమయంలో, నేను ప్రతిదీ రికార్డు చేస్తాను, నా తల్లిని అవమానించిన వారు చట్టం ముందు సమాధానం చెప్పేలా చూస్తాను.” అంటూ సునీల్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు.

తాను ఏ తప్పు చేయలేదని.. కేవలం ఎస్టీ కావటం వల్లే తనను టార్గెట్ చేస్తున్నారని సునీల్ నాయక్ ఆరోపించారు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర్రావును ఎందుకు కేసుల పేరుతో వేధించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కులం గుర్తుకు రాలేదా అని నిలదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విషయంలో తప్పు చేయకపోతే.. ధైర్యంగా కేసు విచారణ ఎదుర్కుని.. తప్పు చేయలేదని నిరూపించుకోవాలని కామెంట్ చేస్తున్నారు కూడా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్