Friday, May 1, 2026 07:56 AM
Friday, May 1, 2026 07:56 AM

పాపం వైసీపీ.. అప్పుడు.. ఇప్పుడు ధర్నాలే..!

అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలకు ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు తప్పటం లేదు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు వస్తుంటాయి. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. చట్టసభల్లో ఈ తేడా స్పష్టంగా ఉంటుంది. కానీ వైసీపీ విషయంలో మాత్రం.. వ్యవహారం పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలకు ఆ స్థానం కొరకరాని కొయ్యగా మారిపోయింది. చివరికి వారు కోరిన అంశంపై చర్చించేందుకు కూడా మొగ్గు చూపించటం లేదు.

Also Read : పెద్దల సభ బరిలో బీఆర్ఎస్.. గేమ్ ప్లాన్..!

వైసీపీకి తొలి నుంచి శాసనమండలిలో ఎదురు దెబ్బలు తప్పటం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాను చెప్పిందే జరగాలి.. జరుగుతుంది అన్నట్లుగా వ్యవహరించారు. అందుకే దేశంలో ఎక్కడా లేనట్లుగా 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. తాను చేసిన ప్రకటనకు అందరూ ఒప్పుకుని తీరుతారంటూ గొప్పలు చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం తనకు ఉందని జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. అయితే జగన్ ప్రతిపాదనకు బ్రేకులు పడ్డాయి. నాటి అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కానీ మండలిలో నాటి ఛైర్మన్‌ షరీఫ్ అహ్మద్ బ్రేకులు వేశారు. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినప్పటికీ.. సభలో మాత్రం రూల్స్ ప్రకారమే నడుచుకున్నారు.

జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో చర్చించినపుడు సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిని అధికారపక్షం వ్యతిరేకించి శాసనమండలి రద్దు చేసే ప్రయత్నం ప్రారంభించింది. అయితే ఛైర్మన్ ప్రకటనను టీడీపీ వర్గీయులు స్వాగతించారు. అమరావతి ప్రాంతవాసులు, షరీఫ్ చిత్రానికి పాలాభిషేకం చేశారు. షరీఫ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ఒకదశలో మండలి వల్ల ఉపయోగం లేదన్నారు. మండలి వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కూడా ప్రతిపాదన చేశారు. దీంతో ఛైర్మన్ షరీఫ్‌ తీరును నిరసిస్తూ.. వైసీపీ నేతలు, మంత్రులు కూడా సభలో ధర్నాలు, నిరసనలు చేశారు. అయినా వారి పోరాటం ఫలించలేదు.

Also Read : క్రికెట్ లీగ్.. కెప్టెన్లు గా పవన్ వర్సెస్ లోకేష్..!

షరీఫ్ తర్వాత మండలి చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజును జగన్ ఎంపిక చేశారు. మన మనిషి, మన మాట వింటారని వైసీపీ నేతలు భావించారు. అయితే వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు మండలిలో దారుణంగా తయారైంది. వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ మోషేన్‌రాజు పదే పదే తిరస్కరిస్తున్నారు. మోషేన్‌రాజుపై తీవ్ర ఆగ్రహంతో చైర్మన్ స్థానాన్ని వైసీపీ నేతలు పదే పదే ముట్టడిస్తున్నారు. సభలో తమకు తగినంత సమయం కూడా ఇవ్వటం లేదనేది కొయ్యో మోషేన్‌రాజు పై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు షరీఫ్ అడ్డుకుంటే ఇప్పుడు మోషేన్‌రాజు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్