Thursday, September 17, 2026 10:33 PM
Thursday, September 17, 2026 10:33 PM

జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్

టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 21న ఢిల్లీ NCRలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో తన దీర్ఘకాల స్నేహితురాలు సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య సాదాసీదాగా నిర్వహించారు. క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ సోషల్ మీడియాలో వారి వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో వీరి వివాహం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. 2025లో దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా వీరిద్దరూ కలిసి కనిపించగా, అదే సంవత్సరం చివరలో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read : టీమిండియా అప్‌డేట్‌.. ఫైనల్ టీమ్‌లోకి శాంసన్..!

ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ మార్కెటింగ్ మరియు మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం అబుదాబిలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె శిఖర్ ధవన్ ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం ప్రకటించిన ఈ జంట, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైంది. ఈ వార్తతో శిఖర్ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Shikhar Dhawan Weds Sophie Shine

Also Read : స్టేజి పైనే వరలక్షి శరత్ కుమార్ కన్నీటి కృతజ్ఞత

ఇది ధవన్ జీవితంలో కొత్త ప్రారంభం. ఆయనకు ముందుగా అయేషా ముఖర్జీతో వివాహం కాగా, వారికి జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. తన కన్నా వయసులో పెద్దదైన అయేషా ముఖర్జీని ప్రేమ వివాహం చేసుకున్న శిఖర్, గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. పెళ్లి అయినప్పటి నుంచి అయేషా ఆస్ట్రేలియాలో జీవనం కొనసాగిస్తుండగా, శిఖర్ మాత్రం జాతీయ జట్టులో ఉండాల్సి రావడంతో భారత్ లోనే ఉన్నాడు. అయితే విభేధాల నేపధ్యంలో తన కుమారుడిని చూడటానికి లేకుండా చేయడంతో బాగా కుంగిపోయాడు. ఏది ఏమైనా ఈ కొత్త జీవిత ప్రయాణానికి అభిమానులు మరియు క్రికెట్ ప్రపంచం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్