Monday, April 6, 2026 08:04 PM
Monday, April 6, 2026 08:04 PM

చెప్పిన లెక్కలన్నీ సభలో అడగొచ్చు కదా..!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 14న కూటమి సర్కార్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందని.. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. ఆదాయంలో ఏపీ పురోగతి 1.97 శాతం మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావటం లేదన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీకి ఏమీ రావటం లేదన్నారు.

Also Read : మరోసారి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ..!

చంద్రబాబు, లోకేష్ పర్యటనలపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. సీఎం చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం.. ఆయన కొడుకుకు మరో విమానం అంటూ ఆరోపణలు చేశారు. ఉదయం హైదరాబాద్‌లో, సాయంత్రం కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూస్తాడు.. మళ్లీ ఉదయం విజయవాడలో ఉంటాడు.. రాత్రికి ఢిల్లీలో కనిపిస్తున్నాడు.. విమానాల్లో జల్సాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే తన పర్యటనపై ఇప్పటి మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. తన డబ్బులతో తానే స్వయంగా టికెట్ కొనుక్కుని తిరుగుతున్నా అని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. అయినా సరే.. జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది.

ఇక ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బకాయిలున్నాయని.. 18 నెలల్లో రూ.3.17 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు జగన్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతి అంశం తప్పుగానే ఉందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారని.. అప్పుల మీద ఆధారపడేది లేదన్న చంద్రబాబు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి స్కీమ్‌లు లేవని.. ఉన్నవి కూడా రద్దు చేశారన్నారు. ఏపీలో ఉన్నది దోచుకో.. పంచుకో.. అనేది మాత్రమే ఉందన్నారు. రాజకీయ పార్టీలకు మ్యానిఫెస్టో చాలా ముఖ్యమన్నారు. తాము ఇచ్చిన మాట మీద నిలబడే ఉన్నామన్నారు. మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేసిన తర్వాతే ప్రజలను గర్వంగా ఓట్లు అడిగామన్నారు జగన్.

Also Read : మైండ్ గేమ్ లో బొత్స సక్సెస్ అయ్యారా..?

అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. బడ్జెట్ మీద ఎంపిక చేసుకున్న పాత్రికేయుల ముందు లెక్కలు చెప్పటం ఎందుకు.. అసెంబ్లీకి రావచ్చు కదా.. ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మ్యానిఫెస్టో 99 శాతం అమలు చేస్తే.. ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 ఎందుకు పడిపోయారు అని విమర్శిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయటం లేదంటున్నారు. ప్రెస్ మీట్ అనే పేరుతో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసి చదవొచ్చు.. అసెంబ్లీలో అయితే.. అలా సాధ్యం కాదని భయమా..? అని సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ఏం చేస్తున్నారు జగన్ సారూ.. అని మీమ్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇలా అయితే కష్టమే.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అధికారుల తీరును బహిరంగంగా.....

అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ...

నరసరావుపేటలో వైసీపీలో రచ్చరచ్చ.....

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వైసీపీలో.....

సట్టా బజార్ షాకింగ్...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ...

ఏపీలో మరో రేపిస్ట్...

ఏపీలో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం...

యుద్ధం.. అప్రకటిత లాక్...

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను...

పోల్స్