Saturday, August 22, 2026 06:43 AM
Saturday, August 22, 2026 06:43 AM

మైండ్ గేమ్ లో బొత్స సక్సెస్ అయ్యారా..?

కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా ఈ వ్యవహారంపై సామాన్య భక్తుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమైంది. ఇక సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన సిట్ కూడా ఈ విషయంలో సంచలన విషయాలు బయటపెట్టింది. ఇక విచారణలో కీలక వ్యక్తులను విచారించలేదు, అరెస్ట్ చేయలేదు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయంగా దీనిపై పెద్ద దుమారమే రేగింది. అయితే వైసీపీ ఈ విషయంలో టీడీపీ మైండ్ గేమ్ ఆడిందనే మాట ఎక్కువగా వినపడుతోంది.

Also Read : కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే నాలుగు రాష్ట్రాలు..!

ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ నేతలు ఈ విషయాన్ని పక్క దారి పట్టించడంలో కంప్లీట్ గా సక్సెస్ అయ్యారనే మాట వినపడుతోంది. శాసన సభకు వైసీపీ హాజరు కాకపోయినా.. మండలికి హాజరు అవుతోంది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కు లింక్ చేసి వైసీపీ చేసిన విమర్శలతో.. కల్తీ లడ్డు వ్యవహారంలో ఒకానొక సందర్భంలో టీడీపీ ఆత్మరక్షణలో పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము చేసిన తప్పును కప్పి పుచ్చుకునే విషయంలో వైసీపీ ఎప్పుడూ ముందే ఉంటుంది అని వింటూ ఉంటాం.

Also Read : ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు..!

ఇప్పుడు కూడా అదే జరుగుతోందని, ఈ విషయంలో సభలో టీడీపీ సమర్ధవంతంగా పోరాడటం లేదనే మాట కూడా వినపడుతోంది. ఈ విషయంలో తమ సభ్యులను ఏకతాటి మీద నడిపే విషయంలో మండలి ప్రతిపక్ష నేత బొత్సా సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. కానీ టీడీపీ మాత్రం బలంగా సమాధానం చెప్పలేకపోతోంది అనే మాట వినపడుతోంది. హెరిటేజ్ సంస్థ పరువు నష్టం దావా వేసినప్పటికీ.. సభలో టీడీపీ దూకుడుగా ఉండి ఉంటే.. ఈ విషయంలో హెరిటేజ్ ఎంటర్ అయ్యే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

మాట జాగ్రత్త.. పార్టీ...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు...

పోల్స్