ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా జరుగుతోంది. గతంలో చంద్రబాబు హయాంలో సీఎం కార్యాలయం ఎలా ఉండేది.. ఎలాంటి ఐఏఎస్ అధికారులు పని చేసేవారు.. ఇప్పుడు సీఎంఓ ఎలా వుంది.. ఎలాంటి అధికారులు పనిచేస్తున్నారు.. అనే విషయం పై పలువురు రిటైర్డు ఐఏఎస్ అధికారులు, ప్రస్తుత ఐఏఎస్ అధికారుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు మాత్రం ఒకే అంటా.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉన్నంత దారుణమైన పరిస్థితి లేదు కానీ.. కొంత దారుణంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులకు మాత్రమే వైసీపీ అభిమాన అధికారులనే ముద్ర లేదనే మాట కూడా వినిపిస్తోంది.
Also Read : అన్నీ తెలిసే ఆడుకుంటున్నారు.. మీకో నమస్కారం..!
ఇదే విషయంపై కొందరు రిటైర్డు ఐఏఎస్ అధికారుల, ప్రస్తుత ఐఏఎస్ అధికారుల అభిప్రాయం ఏమిటంటే.. చంద్రబాబు సహజంగానే మంచి వారు. కానీ ఆయన ఇష్టాలే చిత్ర విచిత్రంగా ఉంటాయని, ఎవరిని ఎంత వరకు నమ్మాలనే విషయంలో ఇప్పటికీ ఆయనకు తెలియదంటారు. ఇదే విషయంపై విమర్శలతో పాటు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం కూడా జరుగుతుంది. నిజాయితీపరులు, సమర్ధులైన ఐఏఎస్ అధికారులను ఎక్కడెక్కడ, ఏ విధంగా నియమించుకోవాలనే విషయం 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు బాగా తెలుసు. ఇదే విషయాన్ని రిటైర్డు ఐఏఎస్ అధికారులు కూడా చాలాసార్లు వ్యాఖ్యానించారు.
అయితే చంద్రబాబుకు ఉన్న ఏకైక బలహీనత, భయం కూడా కులం అంటారు. కొన్ని సందర్భాల్లో కులంతో ముడిపెట్టి చేసే అధికార నియామకాలు ఆయనకు ఏ విధంగా కూడా కలిసి రావటం లేదంటారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారిలో తక్కువ మంది మాత్రమే నిజాయితీ పరులు, సమర్థులు అనేది బహిరంగ రహస్యం. అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు ఏ విధంగా జరిగాయో.. ఇప్పుడు కూడా జరిగేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, రిటైర్డు ఐఏఎస్ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మిహీక నా ఫ్రెండ్ కాదు.. రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
తాజాగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ అంశంపై సచివాలయంలో జోరుగా ప్రచారం నడుస్తోంది కూడా. వారిద్దరి మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఇద్దరిలో ఒకరేమో సీఎం చంద్రబాబుకు చాలా నమ్మకస్తులు. మరొకరేమో మంత్రి లోకేష్ సన్నిహితులు. ఈ ఇద్దరిలో ఒకరిపై వైసీపీ అనే ముద్ర కూడా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఓ వెలుగు వెలిగిన అధికారి. మరి అలాంటి అధికారి పట్ల ఎందుకు ఇంత అభిమానమో ఎవరికీ తెలియటం లేదు.
ఇప్పుడు ఆ ఇద్దరు అధికారుల మధ్య విభేదాలకు కారణాలు మాత్రం బయటకు తెలియటం లేదు. కానీ.. ఆధిపత్య పోరు మాత్రం తారాస్థాయికి చేరుకుంది. ఇంకా చెప్పాలంటే.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కూడా. ఈ ఇద్దరిని కార్యాలయంలో చంద్రబాబు ఎందుకు నియమించుకున్నారనేది ఎవరికీ అర్థం కావటం లేదు. కొసమెరుపు ఏమిటంటే.. ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు ఆంతరంగిక అధికారులుగా పనిచేస్తున్న వారిలో ఒకరిద్దరు మాత్రమే సీఎం చంద్రబాబును పెద్దాయన అని అంటుంటారు. ఎవరైనా చంద్రబాబు పైన విమర్శలు చేస్తే.. గెట్ అవుట్ అంటారని.. పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది చెబుతున్నారు. పైకి మాత్రం చంద్రబాబుపై అభిమానం చూపిస్తూ.. వెనక మాత్రం వైసీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

