Wednesday, February 18, 2026 11:52 PM
Wednesday, February 18, 2026 11:52 PM

ఆ నేతకు బ్రేకులు ఎందుకు వేయలేకపోతున్నారు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలను తప్ప.. మిగిలిన వారి తీరు చూస్తే మాత్రం.. ఆశ్యర్యం కలిగిస్తోంది. వైసీపీ నేతలేమో టార్గెట్ చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ అన్నట్లుగా ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ నేతలు కూడా ఓన్లీ జగన్ అంటున్నారు. ఇదే సమయంలో తమపైన, పార్టీ అధినేత పైన పదే పదే ఆరోపణలు చేస్తున్న నేతలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. కొందరేమో.. తెర వెనుక ఉన్న రాజకీయం ఏమిటని అంటుంటే.. మరి కొందరేమో.. మనకెందుకు అన్నట్లుగా ఉన్నారా.. అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో ఉత్తరాంధ్ర నేతలు.. మరీ ముఖ్యంగా సిక్కోలు జిల్లా నేతలు ముందు వరుసలో ఉన్నారు.

Also Read : మరోసారి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ..!

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నేత వరుదు కల్యాణి. నిజానికి 2009లోనే ప్రజారాజ్యం పార్టీ తరఫున కింజరాపు ఎర్రన్నాయుడుపై శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్షన్నర పైగా ఓటు సాధించి.. ఎర్రన్న ఓటమికి కారణమయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. 2014లో శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత 2019లో అనకాపల్లి పార్లమెంట్ టికెట్ నీకే అని విజయసాయిరెడ్డి చెప్పిన మాట నమ్మారు. కానీ చివరి నిమిషంలో మళ్లీ మొండిచెయ్యి. దీంతో పార్టీ మారుతారనే పుకార్లు కూడా షికారు చేశాయి. కానీ.. జగన్ వెంటే ఉండటంతో.. ఆమెను స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీని చేశారు వైఎస్ జగన్. 2021 నుంచి మండలిలోనే కొనసాగుతున్నప్పటికీ.. తన వాణి వినిపించే అవకాశం మాత్రం మండలిలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వచ్చింది.

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత మండలిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ తరఫున ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఇక వరుదు కల్యాణిని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిని చేశారు. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నప్పటికీ.. ఎమ్మెల్సీలు మాత్రం తప్పకుండా వస్తున్నారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారినా.. వరుదు కల్యాణి మాత్రం వైసీపీ తరఫునే ప్రభుత్వాన్ని సభలో ఇరుకున పెడుతున్నారు. ప్రధానంగా మహిళల సమస్యలు, రక్షణ, అత్యాచారాలు వంటి అంశాలను సభలో ప్రస్తావిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలను కూడా సభలోనే నిలదీస్తున్న వరుదు కల్యాణి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.

Also Read : మోహన్ బాబు అరెస్ట్ తప్పదా..?

నిజానికి వరుదు కల్యాణికి బ్రేకులు వేయడానికే ఎస్సీ మహిళ కావలి గ్రీష్మను మండలికి ఎంపిక చేశారు చంద్రబాబు. కానీ ఆమె ఇప్పటి వరకు సభలో మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక పంచుమర్తి అనురాధ కూడా టార్గెట్ బొత్స అంటున్నారు తప్ప.. వరుదు కల్యాణి నేరుగా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినా సరే.. వాటిని తిప్పికొట్టలేకపోతున్నారు. కల్యాణి చేస్తున్న ఆరోపణలకు స్వయంగా మంత్రి నారా లోకేష్ జవాబు ఇస్తున్నారు. కానీ.. సిక్కోలు జిల్లా ప్రజా ప్రతినిధులు ఏ మాత్రం స్పందించటం లేదు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో ఉన్నా కూడా.. వరుదు కల్యాణి దూకుడుకు బ్రేకులు వేయటం లేదు. ఇక వరుద కల్యాణి సోదరి భర్త అయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ కూడా.. మీడియా పాయింట్ వద్దకు వచ్చి కల్యాణికి కౌంటర్ ఇవ్వటం లేదు. ఉత్తరాంధ్ర నుంచి ఎంపికైన మహిళా ప్రజాప్రతినిధులు అయితే.. మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

అచ్చెన్నాయుడు దగ్గరుండి మీ టికెట్లు ఇప్పించుకున్న గోండు శంకర్, మామిడి గోవిందరావు, ఈశ్వర్రావుతో పాటు గౌతు శిరీష, కావలి గ్రీష్మ వంటి నేతలు కనీసం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. ప్రభుత్వాన్ని ఇంతలా ఇరుకున పెడుతున్న వరుదు కల్యాణికి టీడీపీ నేతలు ఎందుకు అడ్డుకోలేక పోతున్నారనే విషయం ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్‌గా మారింది. సొంత జిల్లా నేతలు అధినేతపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నా కూడా అచ్చెన్నాయుడు అండ్ టీమ్ సైలెంట్‌గా ఉండటం వెనుక మర్మం ఏమిటో ఇప్పటికీ అర్థం కావటం లేదు. సామాజిక వర్గమా.. లేక బంధుత్వమా.. ఈ ప్రశ్నకు సూర్యనారాయణ మూర్తికే తెలియాలి.. అంటున్నారు సిక్కోలు వాసులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అన్నీ తెలిసే ఆడుకుంటున్నారు.....

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి....

ఎలా ఉండే వాడు.....

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన...

పాపం చేస్తే చివరి...

ఏపీలో దారుణాలకు పాల్పడిన వారికి అదే...

నా దుడ్లుతో కొనుక్కున్నా.....

రాజకీయాల్లో ప్రత్యర్ధులను టార్గెట్ చేయడమనేది సహజమే....

మరోసారి అడ్డంగా దొరికిపోయిన...

"వీడెవడండి.. వాడిని వాడే ఎధవ అనేసుకుంటున్నాడు.."...

ఏపీ క్యాబినెట్‌లో కొత్త...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

పోల్స్