Wednesday, February 18, 2026 02:41 PM
Wednesday, February 18, 2026 02:41 PM

మరోసారి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ..!

“వీడెవడండి.. వాడిని వాడే ఎధవ అనేసుకుంటున్నాడు..” అని ఓ సినిమాలో కమెడియన్ పృద్విరాజ్ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు వైసీపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే.. అసలేం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో.. కూడా వైసీపీ నేతలకు తెలియటం లేదు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు.. ఇంకా చెప్పాలంటే సాక్షి మీడియా కార్యాలయం నుంచి వచ్చిన కాపీని అలాగే చదివి వినిపిస్తున్నారు. అంతే తప్ప.. అసలు ఇది చదివితే.. తర్వాత మన పరిస్థితి ఏమిటీ.. ప్రజలు మనల్ని ఏమనుకుంటారు.. అసలు ఇలాంటి ప్రశ్నలు వేయొచ్చా.. లేదా.. అనే కనీస ఇంకిత జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేదని మరోసారి రుజువైంది.

Also Read : షాకింగ్: ఇమ్రాన్ ఖాన్ కు భారత ప్రముఖుల నుంచి మద్దతు..!

2019-2024 మధ్య ఐదేళ్ల పాటు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఆ పార్టీ తరఫున ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో 30 ఏళ్లు పైగా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు కూడా ఉన్నారు. అయినా సరే.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ వచ్చినట్లు చదవాల్సిందే తప్పితే.. మీడియా ముందుకు వచ్చి మనకు తెలిసింది చెప్పకూడదు. ఇంకా చెప్పాలంటే.. లిమిట్‌లో ఉండాలి.. లైన్ దాటకూడదు. అలా దాటితో బాత్రూంలో గుండె పోటు వస్తుందని అందరికీ తెలుసు. అందుకే కేవలం ఓ నలుగురైదుగురు తప్ప.. మిగిలిన వాళ్లు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. పోసాని కృష్ణమురళీ సహా పలువురు పోలీస్ విచారణలో ఇదే విషయం స్పష్టం చేశారు.

వైసీపీ ఓడిన తర్వాత కూడా పరిస్థితి ఏ మాత్రం మారలేదు. కర్నూలు జిల్లాలో బస్సు దహనం కేసులో సాక్షి మీడియా నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివినట్లు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పోలీసు విచారణలో వెల్లడించారు. దీంతో వైసీపీ నేతలకు సొంత తెలివి లేదా అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి అలా వచ్చిన స్క్రిప్ట్ చదివిన ఓ మాజీ ఎమ్మెల్యే.. చౌకబారు వ్యాఖ్యలతో తన అజ్ఞానాన్ని బయటపెట్టారు. సంతనూతలపాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీడియా ముందు వేసిన ప్రశ్నలు.. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ నేతల తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతున్నారు కూడా.

Also Read : వంగా యూనివర్స్.. స్పిరిట్ కు యానిమల్ పార్క్ కు లింక్ అక్కడే..?

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ ఏపీలో పర్యటించారు. ఆయన పర్యటనపై వైసీపీ నేతలు తొలి నుంచి అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. బిల్ గేట్స్‌ వల్ల ఏపీకి పెద్ద ప్రమాదం అన్నట్లుగా ప్రచారం చేశారు. ఇక ఆయన వచ్చి వెళ్లిన తర్వాత వైసీపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. నిజానికి బిల్ గేట్స్ పర్యటనలో లోపాలు వెతికేందుకు ఎలాంటి ఆస్కారం కనిపించలేదు. దీంతో.. ఏం చేయాలో అర్థం కానీ తాడేపల్లి పెద్దలు.. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబును మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆయనతో “బిల్ గేట్స్ టీ, సమోసా, స్నాక్స్ ఖర్చులు వెల్లడించాలి. బిల్ గేట్స్ వస్తే మన రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం..?, ఆయన కోసం చేసిన ఖర్చుతో పిల్లలకు మంచి భోజనం పెట్టొచ్చు కదా.” అంటూ విచిత్రమైన ప్రశ్నలు వేయించారు.

నిజానికి బిల్ గేట్స్ వస్తే మన రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం..? అనే ప్రశ్నకు వైసీపీ నేతలకు ప్రజలే సమాధానం చెబుతున్నారు. సంజీవని ప్రాజెక్ట్, యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఇన్సూరెన్స్, అగ్రిటెక్ వంటివి బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రజలకు తెలుసు కూడా. ఇలాంటి వాటి గురించి గ్రామాల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు కూడా. అందుకే వైసీపీ నేతలు వాటి గురించి ప్రస్తావించకుండా.. సమోసా, టీ, టిష్యూ పేపర్ల ఖర్చులు చెప్పాలంటూ మీడియా ముందుకు వచ్చి తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌ కోసం టీ, సమోసా, పఫ్‌ల కోసం ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని టీడీపీ నేతలు ఇప్పుడు బయటపెడుతున్నారు.

Also Read : ఆ విషయంలో టీడీపీ ఫెయిల్..!

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టాభి వంటి నేతలు మీడియా ముందుకు వచ్చే సమయంలో ఆ పార్టీ నాలెడ్జ్ సెంటర్‌ నుంచి వివరాలు తీసుకునే వాళ్లు. అలాగే నాటి వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలను విత్ ప్రూఫ్ మీడియా ముందు రుజువు చేశారు. ఫోటోలు, వీడియోల ఆధారంగా నాటి ప్రభుత్వ తప్పులను టీడీపీ నేతలు ప్రజలకు వివరించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. కేవలం తాడేపల్లి పెద్దల ఆదేశాలతో సాక్షి నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే మీడియా ముందు చదివేసి వెళ్లిపోతున్నారు. దీని వల్ల పార్టీ పెద్దల దగ్గర మంచి మార్కులు వస్తాయేమో కానీ.. ప్రజల్లో చులకన అవుతామనే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎలా ఉండే వాడు.....

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన...

పాపం చేస్తే చివరి...

ఏపీలో దారుణాలకు పాల్పడిన వారికి అదే...

నా దుడ్లుతో కొనుక్కున్నా.....

రాజకీయాల్లో ప్రత్యర్ధులను టార్గెట్ చేయడమనేది సహజమే....

ఏపీ క్యాబినెట్‌లో కొత్త...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

ఆ విషయంలో టీడీపీ...

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైసీపీ నేతల...

ఆ సీటు ఎవరికి...

వైసీపీ ఓటమికి కారణాలేమిటి..? వైసీపీ ఓడిపోవడానికి...

పోల్స్