Thursday, February 12, 2026 05:33 PM
Thursday, February 12, 2026 05:33 PM

బ్రేకింగ్: వన్డే వరల్డ్ కప్ పై రోహిత్ సంచలన కామెంట్స్..!

టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతారా లేదా అనే దానిపై అనేక అనుమానాలు. వాళ్ళ విషయంలో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఓ రేంజ్ హడావుడి. దీనికి ఆట తోనే ఈ ఇద్దరు దిగ్గజాలు సమాధానం ఇస్తున్నా సరే ప్రశ్నలు మాత్రం వినపడుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో సీరీస్ లో కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపిక అయ్యారు.

Also Read : టీం ఇండియాకు ఓపెనర్ షాక్..?

అయితే తాజాగా రోహిత్.. క్లారిటీ ఇచ్చేసాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌ లో ఆడటంపై కీలక ప్రకటన చేసాడు. టీ20లు, టెస్టుల నుండి రిటైర్ అయిన రోహిత్, ఒకే ఫార్మాట్‌ లో ఆడుతున్నాడు. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియాలో టోర్నమెంట్ ప్రారంభమయ్యే సమయానికి అతనికి 40 ఏళ్లు నిండుతాయి. ఈ టైం లో తన వన్డే భవిష్యత్తుపై రోహిత్ మాట్లాడుతూ.. అప్పటి వరకు ఫిట్‌ గా ఉండటానికి తాను వీలైనంత వరకు తనను తాను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

Also Read : లోకేష్ డిన్నర్ మీట్.. మంత్రి గారి కొత్త సాంప్రదాయం..!

తాను ఖచ్చితంగా అక్కడికి వెళ్లి తన దేశం కోసం ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేసాడు. దీని కోసం తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అన్నాడు. తాను ఈ 50 ఓవర్ల ప్రపంచ కప్ చూస్తూ పెరిగానని తెలిపాడు. అప్పట్లో టి20 ప్రపంచ కప్, ఐపిఎల్ లేవని.. వన్డే ప్రపంచకప్ అంటే పీక్స్ లో క్రేజ్ ఉండేది అన్నాడు. ఆ ట్రోఫీ తనకు కావాలని.. అది ఎంత బరువైనా సరే మోస్తాను అంటూ కామెంట్ చేసాడు రోహిత్. అందుకే తన శక్తి సామర్ధ్యాలకు మించి కష్టపడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే నిరూపించాలి.. వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా...

ఇది చంద్రబాబు ఇచ్చే...

గత ఏడాది కాలంగా ఏపీలో తిరువూరు...

లిక్కర్ కేసుపై సుప్రీం...

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు దర్యాప్తులో ఇప్పటికీ...

సెలవు పై ఐఏఎస్...

సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్...

బిల్డప్ అదుర్స్.. బొమ్మ...

అసెంబ్లీకి జగన్.. కూటమిలో వణుకు..! ఈ...

లోకేష్ డిన్నర్ మీట్.....

రాజకీయాల్లో నిలబడాలి అంటే.. ఎప్పటికప్పుడు సరికొత్తగా...

పోల్స్