Wednesday, May 20, 2026 01:25 PM
Wednesday, May 20, 2026 01:25 PM

లోకేష్ డిన్నర్ మీట్.. మంత్రి గారి కొత్త సాంప్రదాయం..!

రాజకీయాల్లో నిలబడాలి అంటే.. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. ప్రజలకు దగ్గరగా ఉండాలి.. నాయకులతో మమేకం కావాలి. ప్రజా సమస్యలే కాదు నాయకుల సమస్యలు కూడా తెలుసుకుని అడుగులు వేయాలి. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ ముందు నుంచి దూకుడుగానే ఉంటున్నారనే మాట వినపడుతోంది. తాజాగా లోకేష్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనం అవుతోంది. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నాయకులకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో లోకేష్ కీలక అడుగులు వేస్తున్నారు.

Also Read : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఏం మాట్లాడతారో వింటా..!

చాలా మంది ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గాల సమస్యలు సహా అనేక విషయాలపై కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్న నేపధ్యంలో వాటిని తెలుసుకుని అడుగులు వేయాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త సంప్రదాయానికి లోకేష్ శ్రీకారం చుడుతున్నారు. నాయకులకు టైం ఇవ్వడం లేదనే విమర్శకు చెక్ పెట్టడమే కాదు నాయకత్వానికి భరోసా ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

Also Read : జగన్ కు చెన్నకేశవ రెడ్డి ఎలివేషన్.. నిరాశపరిచిన అన్న..!

బడ్జెట్ సమావేశాల వేళ రోజుకో పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులతో డిన్నర్ సమావేశాలు నిర్వహించాలని లోకేష్ నిర్ణయించారు. నేతల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకు దిశా నిర్దేశాలు చేయనున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు అడగడం, ఏయే శాఖల్లో సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం వంటివి లోకేష్ చేస్తారు. నేతల మధ్య గ్యాప్ ఉంటే దానికి పరిష్కారాలు చూపనున్నారు లోకేష్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్