Wednesday, May 20, 2026 01:51 PM
Wednesday, May 20, 2026 01:51 PM

జగన్ కు చెన్నకేశవ రెడ్డి ఎలివేషన్.. నిరాశపరిచిన అన్న..!

రాజకీయాల్లో వైఎస్ జగన్ ది విలక్షణ వ్యక్తిత్వం. ఎవరు ఎన్ని అనుకున్నా జగన్ మాత్రం తాను చేయాలి అనుకున్నది చేస్తూ ఉంటారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో పార్టీ క్యాడర్ ఆలోచన జగన్ ఎంత మాత్రమూ పట్టించుకోవడం లేదు. మీడియాలో మాట్లాడే బదులు సభలో మాట్లాడమని అడుగుతున్నా జగన్.. వెళ్ళడం లేదు.. మిగిలిన పది మందిని వెళ్లనివ్వడం లేదు. ఉభయ సభల ప్రాధాన్యత తెలిసిన పార్టీ సీనియర్లు కూడా జగన్ సభకు వెళ్తేనే బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు..!

ఇక నేటి నుంచి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారనే విషయం తెలియగానే వైసీపీ సోషల్ మీడియా తమ బాస్ కు ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చింది. చెన్నకేశవ రెడ్డి సినిమాలో.. పులివెందులలో పొందూరు ఖద్దరు వేసిన సీన్.. ఆ తర్వాత విలన్ ఇంటికి వెళ్ళగా.. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే సీన్ లతో హడావుడి చేసారు వైసీపీ క్యాడర్. అలాగే కేజిఎఫ్, సలార్ సినిమాల్లో ఉండే ఎలివేషన్ సీన్లు కూడా సందడి చేసాయి. జగన్ పోరాటం ఎలా ఉంటుందో చూస్తారు అంటూ హడావుడి చేసారు.

Also Read : స్పీకర్ సంచలన నిర్ణయం..? వైసీపీ గొంతులో వెలక్కాయ..?

తీరా చూస్తే సభకు హాజరైన పది నుంచి 15 నిమిషాల లోపు జగన్ సభ నుంచి వెళ్ళిపోయారు. కనీసం సభలో జగన్ మాట్లాడే వరకు కూడా ఉండలేదు. రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ మాట్లాడే అంశాలు చాలా ఉన్నప్పటికీ.. జగన్ మాట్లాడితే వైసీపీకి కొత్త జోష్ వచ్చే ఛాన్స్ ఉన్నా సరే జగన్ మాత్రం హాజరు అయ్యేందుకు ఇష్టపడటం లేదు. రాజకీయంగా బలహీనంగా ఉన్న పార్టీకి ఇది సరికొత్త జోష్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే కార్యకర్తలు మళ్ళీ డీలా పడిపోయిన పరిస్థితి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్