Wednesday, May 20, 2026 01:49 PM
Wednesday, May 20, 2026 01:49 PM

టీం ఇండియాకు ఓపెనర్ షాక్..?

ఎట్టకేలకు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్దమైంది. ఈ నెల 15 న రెండు జట్ల మధ్య టి20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ దశ మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో భారత ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. మొదటి మ్యాచ్ కు దూరమైన బూమ్రా.. రెండవ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. బూమ్రా లేకపోవడంతో మొదటి మ్యాచ్ లో సిరాజ్ ను ఆడించారు. కీలక సమయంలో సిరాజ్ మూడు వికెట్లు తీసాడు. అదే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.

Also Read : ఇవేం గ్రేడ్ లు..? క్రికెట్ ను కామెడి షో చేస్తున్నారా..?

ఇక ఆల్ రౌండర్ గా గత కొన్నాళ్ళుగా జట్టులో కీలకంగా మారిన తమిళనాడు ఆటగాడు వాషింగ్టన్ సుందర్ స్థానంపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అతను జట్టులో చేరినట్టుగా జాతీయ మీడియా తెలిపింది. ఈ టైంలో మరో షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ గురువారం ట్రైనింగ్ సెషన్‌ కు హాజరు కాకపోవడంతో ఆందోళన మొదలైంది. కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు అభిషేక్ శర్మ. నమీబియాతో జరిగే టి20 మ్యాచ్ లో అతను ఆడటం కష్టమే. అటు పాక్ తో మ్యాచ్ పై కూడా క్లారిటీ లేదు.

Also Read : ‘యుఫోరియా’.. సమాజానికో పాఠం..!

దాదాపు మిగిలిన ఆటగాళ్ళు అందరూ అందుబాటులో ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా సంజు సామ్సన్ కు అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ తో పాటుగా సఫారీలతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా అతను రాణించలేదు. ఇక ఈ మ్యాచ్ లో అతను రాణిస్తే మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసే అవకాశం ఉండవచ్చు. ఇక బౌలింగ్ విభాగంలో బూమ్రా ఆడితే మాత్రం ఖచ్చితంగా అది భారత్ కు బలంగానే చెప్పవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్