వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరోసారి రచ్చకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబర్ 25న జరగనున్న తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుకల కోసం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం బెంగళూరుకు బయలుదేరనున్నారు. అయితే, బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ప్రాంగణంలో పెళ్లి వేడుకలు నిర్వహించడానికి వీల్లేదని వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Also Read : ఓటమిని జీర్ణించుకోలేక బొత్స వాగుతున్నారు.. చిన్న శ్రీను స్ట్రాంగ్ కౌంటర్..!
భద్రతా కారణాలు, కుటుంబ గోప్యత దృష్ట్యా యలహంక ప్యాలెస్‌లో వివాహం వద్దని జగన్ తేల్చిచెప్పడమే కాకుండా, తాజాగా ఈ వ్యవహారంలో కోర్టు ఆదేశాలను కూడా తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రేపు బెంగళూరుకు వెళ్తున్న షర్మిలను యలహంక ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు జగన్ వర్గం పక్కా స్కెచ్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు, ఆస్తుల పంపకం ప్రకారం యలహంక ఆస్తి వంద శాతం తనకు, తన పిల్లలకే చెందుతుందని షర్మిల మొదటి నుంచి వాదిస్తున్నారు.
Also Read : నాడు వైఎస్సార్ ఆహ్వానిస్తే షర్మిల పెళ్లికి కూడా వెళ్లా: సీఎం చంద్రబాబు
గతంలో వివాదాలు వద్దనే ఉద్దేశంతో పెళ్లి వేదికను బయటకు మార్చుకున్నప్పటికీ, ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్తున్న షర్మిలను అడ్డుకునే ప్రయత్నం జరిగితే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ యలహంక ప్యాలెస్ వద్ద తనను అడ్డుకుంటే, షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే బైఠాయించి ధర్నా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు పులివెందుల ఎమ్మెల్యే జగన్, ఇటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య నెలకొన్న ఈ విభేదాల కారణంగా ఆదివారం బెంగళూరు వేదికగా అన్నాచెల్లెళ్ల మధ్య మరోసారి ‘బిగ్ ఫైట్’ తప్పదన్న ఉత్కంఠ ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో నెలకొంది.


