Monday, July 6, 2026 06:52 PM
Monday, July 6, 2026 06:52 PM

ఆ సినీయర్‌ను నమ్మించి మోసం చేసిన జగన్..!

రాజకీయాల్లో కొందరు నాయకులు ఒక వెలుగు వెలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అలాంటి వారిలో కొందరికి ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. కానీ ఏపీలో రాజకీయాలు మారిపోవడంతో అలాంటి సీనియర్ నేతల బాధ అంతా ఇంత కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి నేతలుగా చలామణి అయ్యారు. చాలా స్వేచ్ఛగా రాజకీయాలు చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం తర్వాత చాలామంది నేతల తలరాతలు మారిపోయాయి. రాజకీయాల్లో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. పదవులు సైతం ఉన్నా అధికారం వెలగబెట్టలేని పరిస్థితి వారిది. ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో వారు సతమతం అవుతున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో పలుచన అవుతున్నారు కూడా.

Also Read : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎవరు..?

రాజధానుల అంశానికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డి వైఖరితో విసిగి పోతున్నారు కొంతమంది సీనియర్లు. అలాంటి వారిలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ముందుంటారు. తొలి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండే ధర్మాన.. రాష్ట్ర విభజన తర్వాత.. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు అదే జగన్ మోహన్ రెడ్డి కింద పని చేయాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో జగన్ విధానాలను సమర్థించాల్సి వచ్చింది. ఇప్పుడు అవే ధర్మానకు చేటు తెస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా వ్యవహరించారు ధర్మాన ప్రసాదరావు. తొలి మూడేళ్లు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో మౌనమునిగా మారిపోయారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాతే తిరిగి యాక్టివయ్యారు. జగన్ మోహన్ రెడ్డిపై పొగడ్తల జల్లు కురిపించారు. జగన్ మంచితనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు.

Also Read : లోకేష్ మార్క్ మ్యాజిక్.. కార్పొరేట్‌ను తలదన్నుతున్న ప్రభుత్వ స్కూల్స్!

ఈ క్రమంలో ఆయనకు విశాఖ పాలన రాజధాని అస్త్రం దొరికింది. గ్రామాల్లో ఏకంగా సభలు ఏర్పాటు చేసి జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర కోసం విశాఖను రాజధానిగా చేర్చారని.. ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఆ మాటలను విశ్వసించలేదు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటర్లు ఆదరించలేదు. అయితే జగన్ మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకోవడంతో ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతలు ఇప్పుడు డిఫెన్స్‌లో పడిపోయారు. వాస్తవానికి 2014 ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటూ.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పే మాటకు విశ్వాసం, విశ్వసనీయత ఉండేది. మంచి వాగ్దాటితో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపగల నాయకుడిగా ధర్మాన ప్రసాదరావుకు పేరు.

Also Read : వైసీపీలో ముదిరిన అంతర్గత పోరు.. అధినేతకు సీనియర్‌ దూరం..!

ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. జగన్ మోహన్ రెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. అవి ఎప్పటికప్పుడు మారిపోతుండడంతో ధర్మాన ప్రసాదరావు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేలా చేశాయి. వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ధర్మాన ప్రసాదరావు విభేదిస్తారన్న కామెంట్ ఉంది. జగన్ వైఖరిని పెద్దగా ఇష్టపడరని కూడా అనుచర వర్గం చెబుతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో.. గత్యంతరం లేని స్థితిలో జగన్ పంచన చేరారు అని కూడా కామెంట్స్ ఉన్నాయి. కానీ అదే జగన్ విధానాలను బలంగా బలపరిచి ధర్మాన ప్రసాదరావు మరింత బలహీనం అయ్యారు. విశాఖ రాజధాని విషయంలో అతి చేశానని.. మావిగన్ స్టాండ్‌తో జగన్ మోహన్ రెడ్డి దారుణంగా మోసం చేశారనే ఆవేదనతో ఉన్నారట ధర్మాన. చూడాలి ధర్మాన ఎలా ముందుకు వెళ్తారో.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

కవిత కొత్త పార్టీకి...

కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రతిపాదించిన నూతన...

రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన...

పోల్స్