Wednesday, August 12, 2026 08:13 PM
Wednesday, August 12, 2026 08:13 PM

ఆ మాట మాట్లాడవద్దు.. మంత్రులకు చంద్రబాబు వార్నింగ్..!

ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల వారీగా సమీక్షించుకోవాలి, క్షేత్రస్థాయిలో పనుల్ని బేరీజు వేసుకోవాలి అంటూ ఏపీ సిఎం చంద్రబాబు అధికారులకు, మంత్రులకు స్పష్టం చేసారు. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్ లో చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం కాసేపటి క్రితం మొదలైంది. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రతీ నెలా 2సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నామన్నారు.

Also Read : చంద్రబాబుపై.. బీజేపీ ఎమ్మెల్యే కులం దాడి వెనుక..?

జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలని, గత 19 నెలల్లో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలని ఆదేశించారు. క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో ఉపకరణాలను కూడా తయారు చేసుకుని ఎగుమతులు చేసే పరిస్థితి వస్తుందన్నారు.

ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి… పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామని, ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏమేరకు చేరుకున్నామన్న అంశంపై స్పష్టతతో ఉంటున్నామని తెలిపారు. గడచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశామన్నారు. వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని చెప్పుకొచ్చిన సిఎం.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్ల తల్లుల ఖాతాల్లో వేశామని తెలిపారు.

Also Read : రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై..?

స్త్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ద్వారా మొబిలిటి పెరిగింది… 4.29 కోట్ల ప్రయాణాలు ఇప్పటి వరకూ జరిగాయి. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ. 6,310 కోట్ల ఆర్ధిక సహకారం అందించామని, డిమాండ్ డ్రివెన్ క్రాప్స్ ఉత్పత్తి చేసేలా అవగాహన పెంచుతున్నామని, రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రైతు ఆత్మహత్యలనేవి జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే.. వాటిని అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటున్నామన్నారు. సంక్షేమ పథకాలు అవసరమా…? అనే చర్చ సరి కాదు… పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమేనని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా వీటి గురించి మాట్లాడవద్దని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో కొత్త మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీపై ఉత్కంఠ...

రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.....

వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా ఉన్న...

డీఎస్సీ ఉద్యమం.. టీచర్లు...

వైసీపీ డీఎస్సీ ధర్నా.. ఆపరేషన్‌ సక్సెస్...

విదేశీ శ్రీవారి భక్తులకు...

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని...

ప్రకాశ్ రాజ్ ఓటు...

బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

పోల్స్