Saturday, September 19, 2026 11:48 PM
Saturday, September 19, 2026 11:48 PM

బ్రేకింగ్: చంద్రబాబు – పవన్ అర్జెంట్ మీట్..!

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. అంబటి రాంబాబు, జోగి రమేష్ విమర్శలు, వాళ్ళ ఇళ్ళపై జరిగిన దాడుల వ్యవహారం అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఓ వైపు పరిపాలన విషయంలో సిఎం చంద్రబాబు పరుగులు పెడుతున్న సమయంలో ఈ పరిణామాలు రాష్ట్రం పరువు కూడా తీస్తున్నాయి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో దీనిపై సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా కీలక పరిణామాలు జరిగాయి.

Also Read : పాక్ వక్రబుద్ధి.. ఐసీసీ షాక్ తప్పదా..?

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ తో సిఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ తర్వాత తన ఆఫీస్ కు పవన్ ను పిలిచిన చంద్రబాబు.. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చించారు. దాదాపు అరగంట పాటు వీరి భేటీ జరిగింది. మంత్రులు కేబినేట్ సమావేశ మందిరంలో ఉండగానే.. సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు, పవన్ కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. తీసుకున్న చర్యలు సహా పలు అంశాలపై సిఎం, డిప్యూటి సిఎం మధ్య చర్చ జరిగిందని ఏపీ సచివాలయ వర్గాలు అంటున్నాయి.

Also Read : ట్రంప్ కు మోడీ థాంక్స్.. దారిలోకి తెచ్చుకున్నాడా..?

ఇక మంత్రులతో కూడా కేబినేట్ భేటీ అనంతరం సిఎం చర్చించారు. కూటమి మంత్రులందరితో విడిగా భేటీ అయిన చంద్రబాబు మంత్రుల అభిప్రాయాలు అడిగారు. శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని, ప్రజల్లోకి వాస్తవాలు తీసుకు వెళ్ళాలి అని సూచించారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సిట్ లేఖ రాసింది. సిట్ సూచనతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసినట్టు సిఎం చంద్రబాబు.. స్వయంగా మంత్రులకు వివరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్