Wednesday, February 4, 2026 10:10 AM
Wednesday, February 4, 2026 10:10 AM

దుర్గమ్మ సన్నిధిలో రౌడీ రాజ్యం.. సెక్యూరిటీ ఏజెన్సీ దారుణాలు..!

బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో రౌడీల రాజ్యం నడుస్తోంది. వీవీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు కనీస గౌరవం లేకుండా ప్రదర్శిస్తున్నారు అక్కడి సిబ్బంది. ప్రైవేట్ ఏజెన్సీకి దేవాదాయ శాఖ దుర్గగుడిలో భద్రతా సిబ్బందిగా బాధ్యతలు ఇచ్చింది. పదుల సంఖ్యలో ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళే అమ్మవారి భక్తులకు ఆధ్యాత్మికత భావన దూరం చేస్తున్నారు. భక్తులపై దాడులకు దిగడం, అసభ్యపదజాలంతో దూషణలకు దిగడం, ప్రోటోకాల్ ధర్శనాలకు వెళ్ళిన వారిని ఇబ్బందులకు గురి చేయడం చేస్తున్నారు.

Also Read : గతం మర్చిపోయిన జగన్..!

కొండ కింద పార్కింగ్ దగ్గరి నుంచి అమ్మవారి దర్శనం వరకు వీళ్ళదే రాజ్యం. ఇటీవల పార్కింగ్ లో ఓ భక్తుడిని బూతులు తిట్టడమే కాకుండా అసభ్యంగా మాట్లాడారు సెక్యూరిటీ సిబ్బంది. తాజాగా పార్కింగ్ వద్ద వంద నుంచి 200 వరకు వసూలు చేస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. సాధారణంగా మంత్రులు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల నుంచి లెటర్ లు పెట్టి.. ప్రోటోకాల్ దర్శనం చేయిస్తూ ఉంటారు. ప్రోటోకాల్ ఆఫీస్ సిబ్బంది తోడు వచ్చి దర్శనం చేయిస్తూ ఉంటారు.

Also Read : బోయపాటి బాలీవుడ్ లాంచ్.. ఖాయమేనా?

అయినా సరే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, భక్తులపై చేతులు వేసి నెట్టడం వంటి చర్యలకు దిగుతూ ఉంటారు. ఇటీవల ఓ మంత్రి ఓఎస్డీ.. అమ్మవారి దర్శనానికి వెళ్ళగా.. ఐడీ కార్డ్ చూపించినా సరే అభ్యంతరకంగా మాట్లాడారు సిబ్బంది. కొండ కింద పార్కింగ్, లిఫ్ట్ పరిసరాలు, ఘాట్ రోడ్డు మార్గం, ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం, ఉచిత, 500 రూపాయల క్యూ దర్శనాలలో వీళ్ళ ప్రవర్తనతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రౌడీలను అక్కడ నియమించారు అని, గుడికి వెళ్ళిన భక్తులు బాధపడే విధంగా ప్రవర్తిస్తున్నారని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ జోక్యం చేసుకుని వారిని తప్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్