Wednesday, February 4, 2026 06:39 AM
Wednesday, February 4, 2026 06:39 AM

లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి.. బోర్డుకు గంభీర్ రిక్వెస్ట్

2024 లో టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. జట్టు ప్రదర్శన రోజు రోజుకి నాశనం చేస్తున్నాడు అనే విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. జట్టులో రాజకీయాలతో పాటుగా ఆటగాళ్ల ప్రదర్శన విషయంలో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక సిరీస్ లు ఓడిపోవడమే కాకుండా స్వదేశంలో టెస్ట్ సిరీస్ లు ఓడిపోవడం అనేది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు నచ్చిన ఆటగాళ్ళను జట్టులోకి తీసుకువచ్చి.. వాళ్ళు ఆడక పోయినా సరే ప్రోత్సహిస్తున్నాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. సీనియర్ ఆటగాళ్లను తప్పించే విషయంలో కనీసం వాళ్లకు గౌరవం ఇవ్వలేదు అనే ఆవేదన కూడా వ్యక్తం అవుతుంది.

Also Read : బ్రేకింగ్: ఉక్రెయిన్ – రష్యా వార్ కు ఎండ్ కార్డ్..?

ఈ టైంలో గంభీర్ నుంచి బీసీసీఐ కి ఓ లేఖ వెళ్లినట్లు సమాచారం. 2026 టి20 ప్రపంచ కప్.. గెలిచి చూపిస్తానని లేదంటే తానే జట్టు నుంచి తప్పుకుంటానని గంభీర్ చెప్పినట్లుగా క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టి20 వరల్డ్ కప్ వరకు ఆటగాళ్ల ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని, యాజమాన్యం కూడా పూర్తిస్థాయిలో తనకు సహకరించాలని కూడా గంభీర్ కోరినట్లు సమాచారం. న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సిరీస్ లో భారత విజయం సాధించడంతో గంభీర్ కాస్త దూకుడుగానే కనపడుతున్నాడు. అయితే తనకు టి20 వరల్డ్ కప్ రూపంలో చివరి అవకాశం ఇవ్వాలని గంభీర్ కోరినట్లు తెలుస్తోంది.

Also Read : వరల్డ్ కప్ కు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్..!

అయితే కొంతమంది ఆటగాళ్ల విషయంలో.. బోర్డు పెద్దలు గంభీర్ పై సీరియస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆడని ఆటగాళ్లను పదేపదే ఎందుకు వెనకేసుకొస్తున్నారని గంభీర్ పై సీరియస్ అయినట్లు కథనాలు వస్తున్నాయి. టెస్ట్ జట్టు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా బోర్డు పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం. ఇటీవల వన్డే సీరిస్ కోల్పోవడం పై కూడా బోర్డు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కోచ్ ను మారిస్తే అనవసరంగా ఇబ్బందులు వస్తాయని.. అందుకే బోర్డు వెనకడుగు వేస్తోందని తెలుస్తోంది. కివీస్ తో జరిగిన టి20 సీరిస్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై కూడా బోర్డులో అసంతృప్తి ఉన్నట్లుగా సమాచారం. ఇక ఆటగాళ్లకు కూడా గంభీర్ కొంత గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ తర్వాత సెలక్టర్ లతో పాటుగా జట్టు యాజమాన్యంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్