Sunday, June 21, 2026 04:47 AM
Sunday, June 21, 2026 04:47 AM

వరల్డ్ కప్ కు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్..!

టీ 20 వరల్డ్ కప్ కు ముందు గాయాలతో ఇబ్బంది పడుతోన్న భారత జట్టుకు శుభవార్త అందింది. జట్టులో కీలక ఆటగాడిగా భావిస్తున్న వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకున్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇటీవల కీలక ఆటగాళ్ళ గాయాలతో ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా ఉన్న సుందర్ గాయపడటంతో అభిమానులలో భయం మొదలైంది. అయితే తాజాగా సుందర్ కోలుకున్నాడని జాతీయ మీడియా తెలిపింది. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని పేర్కొంది.

Also Read : ప్రధాని ఫోన్ కు రెడ్ స్టిక్కర్ వెనుక ఇంత స్టోరీ ఉందా..?

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు అతను అందుబాటులో ఉండే అవకాశం కనపడుతోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పక్కటెముక గాయం నుంచి కోలుకోవడంతో వాషింగ్టన్ సుందర్ నెట్స్‌లో బ్యాటింగ్ మొదలుపెట్టాడు. కాని ఎక్కువ సేపు మాత్రం అతను బ్యాటింగ్ చేయలేదు. కొన్నాళ్ళుగా ప్రాక్టీస్ కు దూరంగా ఉండటంతో ప్రారంభంలో కొంత అసౌకర్యంగా ఉంటుందని, ఇప్పుడు వేగంగా కోలుకుంటున్నాడు అని జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.

Also Read : కల్తీ నెయ్యి కేసు.. అసలు నిందితులు సేఫ్..!

జనవరి 11న వడోదరలోని బిసిఎ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు 26 ఏళ్ల సుందర్ నడుము పైభాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతూ జట్టుకు దూరం అయ్యాడు. సైడ్ స్ట్రెయిన్ కారణంగా సుందర్ ఇబ్బంది పడ్డాడు. అతన్ని వెంటనే.. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌ కు తరలించారు సిబ్బంది. అక్కడ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్, ఆర్థ్రోస్కోపీ అండ్ షోల్డర్ సర్వీస్ డైరెక్టర్ అయిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలో సుందర్ కు చికిత్స అందించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్