Wednesday, February 4, 2026 08:01 AM
Wednesday, February 4, 2026 08:01 AM

మేడం చుట్టూ విమర్శలు.. ఆ వెంటనే..!

రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ బాగా ట్రోల్ అవుతోంది. అదే #WhereIsBangaloreUncle అనే మాట. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా వందనం చేయలేదు. ఆయనకు బదులుగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జెండా వందనం చేశారు. దీంతో జగన్ ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. బెంగళూరు ఎలహంకా ప్యాలెస్ నుంచి జగన్ బయటకు రాలేదని.. జగన్‌కు దేశభక్తి లేదని టీడీపీ సోషల్ మీడియాతో పాటు అభిమానులు, కార్యకర్తలు #WhereIsBangaloreUncle అంటూ హ్యాష్ ట్యాగ్ వైరల్ చేశారు.

ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనితను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. జగన్ జెండా వందనం ఎందుకు చేయలేదనే విషయాన్ని అనిత తన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అదే సమయంలో ఓ ఫోటో కూడా షేర్ చేశారు. బెంగళూరు అంకుల్… ఈ రోజు జెండా వందనం ఎందుకు చేయలేదు ? అంటూ వ్యంగ్యంగా ఉన్న జగన్ ఫోటోను షేర్ చేశారు. మనిషి కనబడలేదు.. ఎక్కడున్నారు..? అంటూ అనిత చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపింది. నిజానికి ఇదే ఫోటో‌ను చాలా మంది నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ హోమ్ మంత్రి పదవిలో ఉన్న అనిత చేయడమే ఇప్పుడు వివాదానికి కారణం. గతంలో ఓ సారి ఇలాగే చంద్రబాబు, పవన్, జగన్ ఏఐ వీడియో చేసిన వారిని మంత్రి లోకేష్ వారించారు. ఇలా ఇంకెప్పుడు చేయవద్దు అని మందలించారు. కానీ ఇప్పుడు అలాంటి ఫోటోను హోమ్ మంత్రి అనిత షేర్ చేయడం కాంట్రవర్సీ అవుతోంది.

Also Read : గిరిజన ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

అనిత పోస్ట్‌పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ““బెంగుళూరు అంకుల్” అంటూ హోంమంత్రి అనిత చేసిన జూగుప్సకరమైన రాతలు చూస్తే కూటమి ప్రభుత్వంకు ఉన్న రాజకీయ భావ దారిద్ర్యం ఏంటో తెలుస్తుంది. “హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” అంటూ మేము వాఖ్యలు చేయచ్చు కానీ మీ స్థాయిలో మేము దిగజారలేం, మాకు రాజకీయ దార్శనికత ఉందే కానీ మీలాగ భావ దారిద్ర్యం లేదు. ఇప్పటికే “వర్క్ ఫ్రమ్ హోం” శాఖగా మీకిచ్చిన శాఖను పాతాళంలో పాతి పెట్టారు, ఇకనైనా దిగజారక దళిత ఆత్మగౌరవం దెబ్బతీయక, సుసంగతమైన, గుణప్రదమైన రాజకీయ అలవాట్లు మీకు వంటబట్టాలని దేవుడ్ని కోరుకుంటున్నా.. మీ అజ్ఞానానికి, అహంకారానికి, అవగాహన లేమికి హోమియోపతిలో ఏమైనా చికిత్స దొరకాలని ఆశిస్తున్నా…” అంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

“బాధ్యత గల హోం మినిస్టర్ పదవిలో ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం ?..” అంటూ వైసీపీ నేత గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సహా పలువురు వైసీపీ అభిమానులు పోస్టులు పెట్టారు. అయితే ఇదే సమయంలో సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బొమ్మలను పెట్టి.. వాటిని తన్నాలని చెప్పినప్పుడు ఏమయ్యారు అని టీడీపీ అభిమానులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారం దుమారం రేగటంతో.. హోమ్ మంత్రి అనిత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ డిలీట్ చేసేశారు. దీనిని కూడా ఇప్పుడు వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

Also Read : మాట జాగ్రత్త.. మంత్రులకు సిఎం వార్నింగ్

“అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల?.. శృతిమించనంత వరకు ఏదైనా ఇంపే.. పరిధులు దాటితే ముమ్మాటికీ కంపే అనే విషయం తెలుసుకొని వైయస్ జగన్ పై వేసిన నీచమైన ట్వీట్‌ను అనిత డిలీట్ చేయడం సంతోషం, క్షమాపణ చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. విమర్శకు సహనం ఉండాలని.. పొగడ్తకు హద్దుండాలని అనితకు ఇంకా తెలియకపోవడం చూస్తే తనపై జాలి కలుగుతుంది. ఏమైనా అనేస్తాం, ఏదైనా చేస్తానంటే అపహాస్యం తథ్యం, అపకీర్తి నిత్యకృత్యంగా మారుతుందని మంత్రి అనిత ఉదాంతం చూస్తే తెలుస్తుంది.” అంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. అసలు పోస్ట్ పెట్టటం ఎందుకు.. మళ్లీ డిలీట్ చేయటం ఎందుకు.. అని సొంత పార్టీ నేతలే అనిత తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు లోకేష్ ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నా కూడా.. ఇలా వ్యవహరించడం ఏమిటని నిలదీస్తున్నారు. మొత్తానికి బెంగళూరు అంకుల్ అంటూ అనిత చేసిన పోస్ట్.. పెద్ద రచ్చ చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్