Wednesday, February 4, 2026 07:59 AM
Wednesday, February 4, 2026 07:59 AM

వైఎస్ అవినాష్‌కు ఎందుకంత ధీమా..?

ఓ వైపు తన తండ్రిని హత్య చేసిన వారిని బయటపెట్టాలనేది ఓ కుమార్తె పోరాటం. అయితే ఆ పోరాటం ఎండమావిలా మారిందని.. పెద్దల అండ ఉన్నంత వరకు తనకు ఏమీ కాదనే ధీమాతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. తనకు ఏమీ కాదన్న ధైర్యంతో.. బరితెగించినట్లు కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కోర్టు చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్న మహిళను వెక్కిరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. చట్టం తనను ఏమీ చేయలేదనే మొండి ధైర్యంలా కనిపిస్తోంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ, చట్టపరమైన వాదనల కంటే ఎక్కువగా ఒక బిడ్డ పడుతున్న వేదనకు అద్దం పడుతుంది. తన తండ్రిని అత్యంత దారుణంగా చంపి, ఆపై ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి జరిగిన ప్రయత్నాలపై డాక్టర్ సునీతా నర్రెడ్డి చేస్తున్న ఈ యుద్ధం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది.

Also Read : ఆ విషయంలో ఇద్దరు సీఎంలు ఒకటే..!

ఆరేళ్లుగా న్యాయం ఎప్పుడు వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న డాక్టర్ సునీతకు సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం అడిగిన ప్రశ్న ఆమె ఆవేదనకు ప్రతిధ్వనిలా నిలిచింది. “ఈ దర్యాప్తు ఇంకెంత కాలం సాగుతుంది? పదేళ్లు పడుతుందా?” అని కోర్టు ప్రశ్నించడం ఆమె ఏళ్ల తరబడి పడుతున్న నిరీక్షణకు అర్థం పట్టింది.

ట్రయల్ కోర్టు కేవలం “పాక్షిక దర్యాప్తు”కు మాత్రమే అనుమతి ఇవ్వడాన్ని డాక్టర్ సునీత గట్టిగా సవాల్ చేశారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాల్సిందేనని, న్యాయం విషయంలో రాజీ పడేది లేదని ఒక కూతురిగా ఆమె పట్టుదలగా నిలిచారు. ఈ కేసులో ఎవరిని విచారించాలో, ఎవరిని కస్టడీలోకి తీసుకోవాలో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఫిబ్రవరి 5వ తేదీన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండటం ఆమెలో కొత్త ఆశను రేకెత్తించింది.

ఈ న్యాయ పోరాటం ఒకవైపు సాగుతుండగానే, కడప వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో తన సోదరి సునీతకు ఒక వెక్కిరింతలా అనిపిస్తోంది. వైఎస్ఆర్, జగన్ ఫోటో ముందు నిలబడి.. మెడలో కాషాయ కండువా వేసుకొని తమాషాగా నవ్వుతూ ఆయన ఇచ్చిన ఆ ఫోజు, గతంలో జరిగిన కొన్ని చేదు ఘటనలను గుర్తుకు తెస్తోంది. తన తండ్రిని కోల్పోయి, న్యాయం చేయమని అడగడానికి జగన్ దగ్గరికి వెళ్లినప్పుడు.. “ఒకవేళ అవినాష్ బీజెపీలో చేరితే ఏమి చేస్తావు?” అని ఆయన తనను బెదిరించారని సునీత గతంలోనే స్వయంగా కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు.

Also Read : పద్మ పురస్కారాల లక్ష్యం అదేనా..!

ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి కాషాయ కండువా మెడలో వేసుకుని, నవ్వుతూ ఫోటోలు దిగుతుంటే, ఒకవైపు తండ్రిని కోల్పోయి, మరోవైపు సొంత కుటుంబ సభ్యుల నుంచే అవమానాలు భరిస్తూ ఆమె చేస్తున్న ఈ పోరాటం ఎంత భారమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు ఇది కేవలం ఒక కేసు కాదు.. ఒక తండ్రికి తన బిడ్డ ఇచ్చే నివాళి.

అధికారం, అంగబలం ఉన్న వ్యక్తులతో తలపడుతున్నా.. “నిజం ఒకరోజు గెలుస్తుంది” అనే నమ్మకమే ఆమెను ప్రతి హియరింగ్‌కు నడిపిస్తోంది. ఫిబ్రవరి 5న సుప్రీంకోర్టులో జరగబోయే విచారణలోనైనా ఈ కుమార్తె ఆవేదనకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్