తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో సిబిఐ సిట్ తుది చార్జ్ షీట్ దాఖలు చేసింది. అసలు పాలు, పెరుగు లేకుండానే నెయ్యి తయారు చేసి పంపారు అంటూ సంచలన విషయాలను ప్రస్తావించింది. ఈ కేసులో నిందితుల్లో 12 మంది టీటీడీ అధికారులే అంటూ స్పష్టం చేసింది. అందులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పియె చిన్న అప్పన్న కూడా ఉన్నారు అంటూ తెలిపింది. 60 లక్షల కిలోలు కొంటె అది మొత్తం కల్తీ నెయ్యిగా నిర్ధారించింది సిట్. భోలే బాబా డైరికి కమీషన్ లు తీసుకుని కాంట్రాక్ట్ ఇచ్చారని గుర్తించింది.
Also Read : బంగారం కొనగలమా..? రాకెట్ కంటే వేగంగా..!
ఇక్కడి వరకు బాగానే ఉంది గాని.. దీనిపై వైసీపీ కార్యకర్తలు గాని, వైసీపీ నాయకులు గాని.. ఆ పార్టీ మీడియా గానీ ఎక్కడా రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయంగా అత్యంత దుమారం రేపి.. తమ పార్టీని జాతీయ స్థాయిలో దోషిని చేసిన ఈ కేసులో.. సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన సిబిఐ సిట్.. ఆధారాలతో సహా వాస్తవాలు బయటపెట్టడంతో ఆ పార్టీ మౌనాన్ని ఎంచుకుంది. కేసు బయటకు వచ్చినప్పుడు లాజిక్స్ మాట్లాడిన నాయకులు.. ఇప్పుడు మాత్రం మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.
Also Read : వాళ్లు చట్టానికి అతీతులా.. విచారిస్తే తప్పేంటి..?
కేసు విచారణలో రాష్ట్ర పోలీసుల పాత్ర ఉంటే ఏదోక ఆరోపణలు చేసి ఉండే వైసీపీ.. ఇక్కడ సిబిఐ ఎంటర్ కావడంతో సైలెంట్ అయిపొయింది వైసీపీ. అయితే ఈ కేసులో తమ నాయకులను అరెస్ట్ చేయకపోవడంతోనే వైసీపీ సైలెంట్ అయిపోయి ఉండవచ్చు అనే వ్యాఖ్యలు సైతం వినపడుతున్నాయి. ఇక సిబిఐ అధికారులు కూడా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయకుండా కేవలం కాంట్రాక్ట్ సంస్థ, ఉద్యోగులతోనే కేసు విచారణ ముగించారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందనే విమర్శలు సైతం ఉన్నాయి.

