Wednesday, February 4, 2026 06:39 AM
Wednesday, February 4, 2026 06:39 AM

మెడపై పర్ఫ్యూమ్ స్ప్రే చేయవచ్చా..?

ఈ రోజుల్లో వాతావరణ మార్పులతో.. చెమట వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇదే సమయంలో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు ఇతరులతో మమేకం అయ్యే సమయంలో చెమట వాసన అనేది ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు పర్ఫ్యూమ్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది మెడపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ ఉంటారు. ఈ అలవాటు అసలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలు పర్ఫ్యూమ్ ను మెడపై స్ప్రే చేయడం అసలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

Also Read : దావోస్ మ్యాన్.. చంద్రబాబు ఊహించని గౌరవం..!

మెడ నేరుగా థైరాయిడ్ గ్రంథిపై ఉంటుంది. ఇది కీలకమైన హార్మోన్-నియంత్రణ అవయవం. ఈ ప్రాంతంలో చర్మం పలుచగా, ఎక్కువ రక్తనాళాలు కలిగి ఉంటుంది కాబట్టి, సింథటిక్ సువాసనలకు పదే పదే అక్కడ స్ప్రే చేయడంతో.. రసాయనాలు శరీరంలోకి మరింత లోతుగా చొచ్చుకుపోతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆధునిక సువాసనా పరిమళ ద్రవ్యాలు కేవలం ఉపరితల స్థాయి సువాసనలు కాదని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. వాటిలో థాలేట్లు, ద్రావకాలు, ఫిక్సేటివ్‌లు వంటి పదార్థాలు ఉన్నాయనేది ఆందోళన.

Also Read : మిథున్ రెడ్డికి గాలం.. రంగంలోకి ఈడి

ఇవి చర్మంలోకి చొచ్చుకుపోయి చర్మ సమస్యలకు కారణంగా మారే అవకాశం ఉంది. ఈ రసాయనాలు ఆవిరి కావడానికి బదులుగా లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరికొందరు తెలిపిన వివరాల ప్రకారం.. మెడపై క్రమం తప్పకుండా పెర్ఫ్యూమ్ వాడితే.. అలసట, ఆందోళన, మానసిక స్థితిలో మార్పులు, మెడ చుట్టూ చికాకు, సువాసన వల్ల కలిగే తలనొప్పి, హార్మోన్ల అసమతుల్యత వంటి లక్షణాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. పర్ఫ్యూమ్ ఎక్కువగా చర్మం మందంగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే స్ప్రే చేయాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్