భారత క్రికెట్ సంక్షోభంలో పడిందా..? దుర్భేధ్యమైన జట్టుగా పేరున్న జట్టును పసికూనలుగా మార్చేస్తున్నారా..? గిల్ నాయకత్వం కోసం జట్టు బలైపోతుందా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. 2024 టి20 వరల్డ్ కప్ గెలిచే నాటికి భారత జట్టు ఎంతో బలంగా కనపడింది. టెస్ట్ క్రికెట్ లో కూడా క్లిష్టమైన విజయాలు సాధించింది. స్వదేశంలో అయినా విదేశాల్లో అయినా.. ఎంతో కఠినంగా ఉండే సేనా దేశాల్లో అయినా భారత జట్టుకు ఎదురు లేదు అనే మాట వాస్తవం. కానీ.. ఇప్పుడు మాత్రం పసికూనగా మారిపోయింది.
Also Read : కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ.. సెల్యూట్ విరాట్ భాయ్
మహేంద్ర సింగ్ ధోనీ తయారు చేసిన ఆటగాళ్ళు.. రోహిత్, విరాట్.. భారత జట్టును పటిష్టంగా నిలిపారు. ఇద్దరి సారధ్యంలో జట్టు చాలా బలంగా కనపడింది. కోచ్ లు గా రవి శాస్త్రి, అనీల్ కుంబ్లే, ద్రావిడ్ ముగ్గురూ జట్టు కోసం అహర్నిశలు కష్టపడిన పరిస్థితి. అలాంటి జట్టు వరుసగా ఓటములు ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తోంది. గంభీర్ నేతృత్వంలో జట్టు.. 2024లో శ్రీలంకలో రెండు దశాబ్దాల తర్వాత వన్డే సీరీస్ కోల్పోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో వైట్ వాష్ ఎదుర్కొంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పెర్త్ లో మినహా మిగిలిన టెస్ట్ లలో ఓడిపోయింది.
చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినా.. ఇంగ్లాండ్ లో గెలవాల్సిన మ్యాచ్ లు ఓడిపోయినా.. మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సీరీస్ కోల్పోయినా.. ఇప్పుడు కివీస్ తో వన్డే సీరీస్ కోల్పోయినా.. అన్నీ కూడా జట్టు యాజమాన్యాన్నే కారణంగా చెప్తున్నాయి. 2024 లో కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ప్రయోగాలతో జట్టు ఒకరకంగా నాశనం అయిపొయింది. ఫేవరేటిజంతో సీనియర్లను తప్పించి.. శుభమన్ గిల్ ను కెప్టెన్ ను చేసాడు గంభీర్. పుజారా, రహానే, అశ్విన్, షమీలను జట్టుకు దూరం చేసాడు.
Also Read : మంత్రుల మెడపై సోషల్ మీడియా కత్తి..!
టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ, రోహిత్ లను రిటైర్ అయ్యే విధంగా చేసి.. జట్టును బలహీనపరిచాడు. హర్షిత్ రానా, జడేజా, ప్రసిద్ కృష్ణ వంటి ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ.. అద్భుతంగా రాణించే వాళ్ళను ఇబ్బందుల్లో పెట్టాడు. రుతురాజ్, అక్షర పటేల్ అద్భుతంగా రాణిస్తున్నా సరే వాళ్ళను జట్టుకు దూరంగా ఉంచుతున్నాడు. ఇషాన్ కిషన్, అయ్యర్ లు తన మాట వినలేదు అనే కారణంతో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించాడు అనే ఆరోపణ కూడా ఉంది. ఇక ఇప్పుడు ఓటమితో మరోసారి విమర్శకులు తమ విమర్శలకు పదును పెట్టారు. రోహిత్, కోహ్లీ వయసు అయిపోతే.. జడేజా వయసు అవ్వదా అంటూ సెటైర్ లు వస్తున్నాయి.

