Wednesday, May 6, 2026 10:02 PM
Wednesday, May 6, 2026 10:02 PM

మిథున్ రెడ్డికి గాలం.. రంగంలోకి ఈడి

దాదాపు పదేళ్ల నుంచి ఏపీలో బలపడాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి.. వైసిపి అగ్ర నాయకత్వంపై గురిపెట్టిందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రజల్లో పట్టు, ఆర్థికంగా బలంగా ఉండే నాయకుల కోసం, బిజెపి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు టీడీపీలో ఉన్న నాయకులు పై గురి పెట్టింది. అది సఫలం కాకపోవడం, ఏపీలో టిడిపి క్షేత్రస్థాయిలో బలహీన పడకపోవడంతో 2024 ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళింది. అయితే 2024 నుంచి వైసీపీ నాయకత్వం పై బిజెపి గురిపెట్టినట్లుగా అర్థమైంది. కేసులున్న పలువురు నాయకులు బిజెపిలో జాయిన్ కావడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

Also Read : రాహుల్ ను ఇంకా ఎందుకు వాడట్లేదు..? షాక్ లో మాజీలు..!

అయితే ఇప్పుడు నేరుగానే బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పై గురి పెట్టింది బిజెపి. వైసీపీలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తూ ఉంటారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడుగా కూడా ఆయనకు పేరు ఉంది. తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం జగన్ అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం చూస్తూనే ఉంటాం. లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు లిక్కర్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఈనెల 23న మిథున్ రెడ్డి విచారణకు రావాలంటూ నోటీసులు కూడా పంపింది. విదేశాలకు డబ్బు పంపడంలో ఎంపీ గారు కీలకపాత్ర పోషించారు అనేది ప్రధాన ఆరోపణ.

Also Read : మంత్రుల మెడపై సోషల్ మీడియా కత్తి..!

అదేవిధంగా మద్యం తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడంలో కూడా మిథున్ రెడ్డిది కీలక పాత్రగా భావించారు. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో బిజెపి బలపడాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ గా చేసుకుని ఈడిని ప్రయోగిస్తోంది బిజెపి అంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంటర్ కావడంతో.. వైసీపీ అగ్ర నాయకత్వంపై గురి పెట్టింది అనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఇదే అంశంపై చర్చ కూడా జరిపినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్