Wednesday, August 5, 2026 11:52 AM
Wednesday, August 5, 2026 11:52 AM

టీటీడీపై విదేశీయుని వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి మొదలు, దర్శనం, ప్రసాదం, అన్న ప్రసాదం, రవాణా వంటి సదుపాయాలు కూడా ఉచితంగానే అందిస్తోంది టీటీడీ. నిత్యం 20 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా దర్శించుకుంటారు. అలాగే దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ ఒక లడ్డూను ప్రసాదంగా ఉచితంగా అందిస్తోంది టీటీడీ. ఇక తిరుమలలో ఒకచోట నుంచి మరో చోటికి ఉచితంగా ప్రయాణించేందుకు శ్రీవారి ధర్మ రథం అందుబాటులో ఉంది. అలాగే తిరుమల వచ్చిన భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తోంది టీటీడీ.

Also Read : అమ్మో పవన్.. అధికారులలో గుండె దడ..!

తిరుమలకు వచ్చే భక్తులకు నామా మాత్రం రుసుం వసూలు చేసి వసతి గదులు కేటాయిస్తోంది టీటీడీ. రూ.50, రూ.100, రూ.200లకు ఒక రోజు పాటు వసతి గదులు కేటాయిస్తోంది. అదే సమయంలో భక్తుల వసతి సముదాయం.. పీఏసీ పేరుతో ఇప్పటికే 5 కాంప్లెక్స్‌లు నిర్మించింది టీటీడీ. వీటిలో భక్తులకు ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తోంది. ఇందులో కూడా అందుబాటులో వేడి నీటి స్నానం, లాకర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. తాజాగా 2,500 మంది భక్తులు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా పీఏసీ – 5 వెంకటాద్రి నిలయం నిర్మించింది టీటీడీ. దీనిని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక వీటితో పాటు తిరుమలలో భక్తులకు ఉచితంగా అన్న ప్రసాద వితరణ కోసం తరిగొండ వెంగమాంబ భవనంలో నాలుగు హాల్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్‌లో ఏకకాలంలో వెయ్యి మంది భోజనం చేసే సదుపాయం ఉంది. ఇవి ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

Also Read : స్టార్ సినిమా పేరుతో అసభ్యతా? ‘టాక్సిక్’ టీజర్‌పై పబ్లిక్ ఫైర్

తిరుమలపై వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ విదేశీయుడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుమలలో ప్రత్యేకంగా అన్న ప్రసాద వితరణపై విదేశీ యూట్యూబర్ వీడియో చేశాడు. ఇందులో తనకు ఎదురైన అనుభవాలను స్వయంగా వెల్లడించారు. ఉదయం 9.30 గంటల సమయంలో అన్నప్రసాద కౌంటర్‌ హాల్‌-4లోకి వెళ్లాడు. అలా వెళ్తున్న సమయంలో హాల్‌లోని చెప్పులు వేసుకోకూడదని తెలిపారు. అలాగే హాల్ మధ్యలో ఉన్న పెయింటింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాను హాల్‌లోని రాక ముందే టిఫిన్ ప్లేట్లు సిద్దం చేశారని.. ఒక గ్లాస్ కూడా ఉంచారని వివరించారు. ఉదయం టిఫిన్‌కు వేడిగా పొంగల్, వేరు శనగ పప్పుల పచ్చడి ఇచ్చారన్నారు. ఆ తర్వాత వేడి వేడిగా సాంబార్‌ కూడా ఇచ్చారని.. ఇది చాలా వేడిగా, బాగుందన్నారు. ఇంత రుచికరమైన సాంబార్ తాను ఎక్కడా తినలేదన్నారు. ఈ ప్రసాదం ఎంత కావాలంటే అంత అందిస్తారని.. ఎలాంటి లిమిట్ లేదని తెలిపారు. టీటీడీ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించిన విదేశీయుడు.. ఇండియా ఈజ్‌ ఏ గ్రేట్ కంట్రీ అంటూ వీడియో ముగించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్