Wednesday, August 5, 2026 12:53 PM
Wednesday, August 5, 2026 12:53 PM

హర్షిత్ ను ఆల్ రౌండర్ గా మారుస్తున్నాడా..?

హర్షిత్ రాణా.. గత ఏడాది కాలంగా ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న బౌలర్ మరొకరు లేరు. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఆటగాడికి వచ్చిన అవకాశాలు మరో ఆటగాడికి రాలేదు అనే మాట వాస్తవం. అతని కోసం సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి.. మూడు ఫార్మాట్ లలో అవకాశాలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. 2024 లో ఆస్ట్రేలియా పర్యటన ద్వారా జట్టులోకి అడుగు పెట్టిన హర్షిత్.. ఆ తర్వాతి నుంచి మూడు ఫార్మాట్ లలో ఆడటం చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అతనిని తీసుకోవాలని భావించాడు గంభీర్.

Also Read : పది నిమిషాల్లో డెలివరీ క్యాన్సిల్.. కేంద్రం వార్నింగ్..!

కానీ అక్కడ ఫ్యాన్స్ విషయంలో విమర్శలు ఉండటంతో అన్షుల్ కామ్బోజ్ కు అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు అతనిని ఆల్ రౌండర్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్ధమవుతోంది. వన్డేలు, టి20 లలో అతనిని మిడిల్ ఆర్డర్ లో ఆడించాలని ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేక టీం ఇండియా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారిని పరిక్షించినా సరే మంచి ఫలితాలు రాలేదు. పాండ్యా వైట్ బాల్ కు మాత్రమే పరిమితం అయ్యాడు.

Also Read : విజయ్ ను సిబిఐ ఏం అడిగింది..?

ఇప్పుడు హర్షిత్ ను మూడు ఫార్మాట్ లకు ఆడించాలి అంటే.. అతనిని బ్యాట్స్‌మన్ గా కూడా షైన్ చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. రేపు తాను కోచ్ గా ఉన్నా లేకపోయినా సరే హర్షిత్ కు ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ఆల్ రౌండర్ గా మారిస్తే మంచిది అనే భావనలో ఉన్నాడు. అందుకే ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో, గతంలో ఆస్ట్రేలియాలో ఈ విధంగా ఆడించాడు అంటున్నారు ఫ్యాన్స్. మొన్న న్యూజిల్యాండ్ తో మొదటి వన్డేలో హర్షిత్ కీలక సమయంలో ఆడిన దూకుడు ఇన్నింగ్స్ భారత్ కు కలిసి వచ్చింది. మరి భవిష్యత్తులో మరింతగా రానిస్తాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్