Saturday, September 19, 2026 03:32 PM
Saturday, September 19, 2026 03:32 PM

దూరమవుతోన్న అనుచరులు.. వైసీపీ నాయకుల్లో కొత్త భయం..!

రాజకీయాల్లో అధికారం అనేది శ్రీరామ రక్ష. అధికారంలో ఉన్నప్పుడు మనకు జై కొట్టే చాలా మంది.. ప్రతిపక్షంలో మాత్రం భయపడుతూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు.. అండగా ఉండే ఎందరో.. అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం.. తమ దారి తాము చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. జై కొట్టిన జనాలే భయంతో దూరమవుతున్నారు. ముఖ్యంగా అనుచరులను నమ్మలేని పరిస్థితిలో వైసీపీ నాయకత్వం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Also Read : తెలంగాణలో పవన్ తో బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ..?

కీలక నాయకుల అనుచరుల గత వ్యవహారాలపై పోలీసులు ఫోకస్ చేసారు. కబ్జాలు,కూనీలు.. ఇతరత్రా వ్యవహారాల్లో ఉన్న వారి ఆట కట్టిస్తున్నారు. కొడాలి నానీ, వల్లభనేని వంశీ, భూమన కరుణాకర్ రెడ్డి వంటి నాయకుల అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇతర నాయకుల అనుచరులపై కూడా పోలీసులు ఫోకస్ చేసారు. దీనితో నాయకులను నమ్ముకోకుండా తమ దారి తాము చూసుకుంటున్నారు. బెయిల్ కూడా అనుచరులకు కష్టంగా మారింది.

Also Read : భారత్ తో రాజీకి ట్రంప్ అడుగులు..? టూర్ ఫిక్స్ అయిందా..?

కొడాలి నాని, వల్లభనేని వంశీ అనుచరులు కొందరు నెలలు తరబడి జైలు లోనే ఉంటున్నారు. ఇవి గమనిస్తున్న చాలా మంది అనుచరులు ఇప్పుడు సైడ్ అయిపోతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఎక్కడైనా మాట్లాడాలి అంటే చాలు భయపడిపోతున్నారు. కొందరు అయితే దేశం దాటి వెళ్ళిపోయారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. కబ్జాలు చేసిన భూములను కూడా కొన్ని ప్రాంతాల్లో పోలీసులు విడిపిస్తున్నారు. గంజాయి, ఇతర అక్రమ వ్యాపారాలు చేసిన వారిపై సైతం గురి పెట్టారు. దీనితో అనుచరులను కాపాడుకోలేక నాయకులు సైతం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్