ఉమ్మడి ఖమ్మం జిల్లా” ఏపీ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం. ఏపీ సరిహద్దుల్లో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలో ఏపీ రాజకీయాల ప్రభావం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. టీడీపీ, వైసీపీలకు ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. ఆ పార్టీలు గత ఆరేళ్ళుగా ఇక్కడ పోటీలో లేకపోయినా.. క్యాడర్ మాత్రం అలాగే ఉంది. సిఎం రేవంత్ రెడ్డికి టీడీపీ, బీఆర్ఎస్ కు వైసీపీ క్యాడర్ అండగా నిలవడం మొదలుపెట్టాయి. రెండు పార్టీల సోషల్ మీడియా.. 2023 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి.
Also Read : అమిత్ షాతో చంద్రబాబు హడావుడి భేటీ.. కారణమేంటి?
ఇక ఇప్పుడు మరోసారి ఈ రెండు పార్టీల మధ్య ఖమ్మంలో యుద్ధం నడుస్తోంది. జెండాలు ఏవైనా.. పోరు మాత్రం ఈ రెండు పార్టీల మధ్యనే ఉంది. రేవంత్.. ఏపీ సిఎం చంద్రబాబుతో సన్నిహితంగా ఉండటంతో టీడీపీ క్యాడర్ మొత్తం సిఎంకే సపోర్ట్ గా ఉంది. కేటిఆర్ కు జగన్ కు మధ్య స్నేహం ఉండటంతో.. బీఆర్ఎస్ జెండాలు మోస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వీరి మధ్యనే పోరు జరిగింది. చాలా గ్రామాల్లో టీడీపీ మద్దతు కోసం కాంగ్రెస్, వైసీపీ మద్దతు కోసం బీఆర్ఎస్ బహిరంగంగా ప్రయత్నం చేసాయి.
Also Read : ఏపీలో సీనియర్ల వైరాగ్యం.. రాజకీయాలకు గుడ్ బై..?
జెండాలు వేసుకునే ప్రచారానికి కూడా వెళ్ళారు. బీఆర్ఎస్ నాయకుల ప్రచారంలో వైసీపీ జెండాలు, కాంగ్రెస్ ప్రచారంలో టీడీపీ జెండాలు కనపడుతున్నాయి. బహిరంగ పోరే కాదు సోషల్ మీడియా పోరు కూడా వీరి మధ్యనే జరుగుతోంది. రేవంత్.. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంటే.. వైసీపీ సోషల్ మీడియా రేవంత్ ను దుమ్మెత్తిపోస్తోంది. దీనితో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తోంది. త్వరలో జరగబోయే పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం పోరు వీరి మధ్యనే ఉండనుంది. బీఆర్ఎస్ కు ఖమ్మంలో క్యాడర్ తక్కువ కావడంతో వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తోంది. బీఆర్ఎస్ నాయకులు సైతం వారితోనే ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ బీఆర్ఎస్ కు మద్దతుగా నిలవడంలో వైసీపీ తమ వంతు పాత్ర పోషిస్తోంది. తెలంగాణా మొత్తం ఈ పరిస్థితే ఉన్నప్పటికీ.. ఖమ్మంలో మాత్రం కాస్త ఎక్కువగానే కనపడుతోంది.

