Sunday, June 21, 2026 04:51 AM
Sunday, June 21, 2026 04:51 AM

5 వేల కిలోమీటర్లు..? జగన్ సరికొత్త ప్లానింగ్..?

ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ పాదయాత్రకు రంగం సిద్దం చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ కష్టమని భావిస్తోన్న వైఎస్ జగన్.. బెంగళూరు నుంచే వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. పార్టీ కీలక నాయకులతో టచ్ లో ఉంటున్న జగన్.. 2029 ఎన్నికల వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాదయాత్రకు తాను సిద్దమని ముందు నుంచి చెప్తూ వస్తున్న జగన్.. ఇప్పుడు ఆ దిశగానే రాజకీయం మొదలుపెట్టారు.

Also Read : గోదావరిపై కన్నేసిన ఒడిశా..!

2017 లో జగన్ చేసిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆయనను అధికారంలోకి తీసుకొచ్చింది కూడా ఆ పాదయాత్రే. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టి.. రాష్ట్రంలో కనీసం 5 వేల కిలోమీటర్లు తిరగాలని జగన్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. 2027 సంక్రాంతి తర్వాత యాత్ర మొదలుపెట్టి.. ఏకంగా రెండేళ్ళ పాటు ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు జగన్. అత్యంత సన్నిహితులతోనే రూట్ మ్యాప్ ప్లాన్ కూడా చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. 2024 నుంచి పార్టీ క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పడుతోంది.

Also Read : ఆ విషయంలో సారీ చెప్పిన అనసూయ..!

రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా కనపడటం లేదు. దీనితో ప్రజల మద్దతు అవసరం అని భావిస్తున్న జగన్.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 లకు పైగా బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి రాబోయే ఆరు నెలల పాటు ప్రజల్లో ఉండేలా ప్రణాళిక సిద్దం చేసుకున్న జగన్.. పార్టీ ప్రక్షాళన కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. పార్టీ నాయకులు బయటకు రాకపోవడంతో క్యాడర్ లో కొంత ఒత్తిడి కనపడుతోంది. అందుకే జగన్ ఇప్పుడు ప్రజా జపం చేసేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్