Wednesday, May 6, 2026 11:23 PM
Wednesday, May 6, 2026 11:23 PM

క్యాన్సర్ రోజులపై యువరాజ్ సంచలన విషయాలు..!

యువరాజ్ సింగ్” టీం ఇండియాకు దొరికిన అరుదైన ఆటగాళ్ళలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ లో యువరాజ్ చూపిన ప్రభావం.. బహుశా గత పదేళ్ళలో మరో ఆటగాడు చూపలేదు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అతని ఆట తీరు, ఐసీసీ టోర్నీలలో అతని దూకుడు భారత్ కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాయి అనే మాట వాస్తవం. డాషింగ్ క్రికెటర్ అనే మాట అర్ధం చెప్పిన లెఫ్ట్ హ్యాండర్.. యువరాజ్. అలాంటి ఆటగాడు నాడు క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించాడు. 2011 ప్రపంచకప్ సమయానికి అతనికి క్యాన్సర్ బయటపడింది.

Also Read : డొమెస్టిక్ క్రికెట్ కు వాల్యూ లేదా..? వాళ్లకు ఎందుకీ అన్యాయం..?

టోర్నీ మధ్యలో రక్తపు వాంతులు చేసుకోవడం, అలసిపోవడం చూసిన అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. తాజాగా వాటిపై యువరాజ్ మాట్లాడాడు. తనకు 3-6 నెలలు మాత్రమే టైం ఉందని వైద్యులు చెప్పారని వెల్లడించాడు. కెవిన్ పీటర్సన్ ది స్విచ్ లో యువరాజ్ ఈ కామెంట్స్ చేసాడు. ఇంకా మూడు నుండి ఆరు నెలల టైం ఉందని చెప్పినప్పుడు.. తాను చనిపోతానని అనుకున్నాను అన్నాడు. తన ఊపిరితిత్తులకు, గుండెకు మధ్య కణితి ఉండి, నాడిని నొక్కి ఉంచడం వల్ల ఇబ్బంది పడినట్టు తెలిపాడు.

Also Read : ఆ విషయంలో సారీ చెప్పిన అనసూయ..!

కీమోథెరపీ చేయించుకోకపోతే తనకు గుండెపోటు వస్తుందని వైద్యులు చెప్పారన్నాడు. ఆ టైం లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని, టెస్ట్ జట్టులో చోటు కోసం ప్రయత్నం చేసాను అని గుర్తు చేసుకున్నాడు. కానీ కీమో కోసం అమెరికా వెళ్ళడం మినహా మార్గం లేదన్నాడు. 2011–12 కాలంలో యువరాజ్ అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ కాలాన్ని శారీరకంగా, మానసికంగా అలసిపోయిన కాలంగా అభివర్ణించాడు. ఆ టైంలో డాక్టర్ ఐన్‌ హార్న్, నువ్వు క్యాన్సర్ లేని వ్యక్తిగా బయటకు వెళ్తావని చెప్పినప్పుడు, ఆ మాటలు తనకు బలాన్నిచ్చాయన్నాడు. తాను మళ్ళీ క్రికెట్ ఆడగలనని చెప్పినప్పుడు, అది రెండవ జీవితంలా అనిపించిందని పేర్కొన్నాడు. చివరికి 2012 లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టాడు యువీ. 2017 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్