సాధారణంగా ప్రజాప్రతినిధులుగా ఒకటికి రెండుసార్లు గెలిస్తే కొంతమందిలో వ్యవహార శైలి మారిపోతూ ఉంటుంది. తమను తాము ఎక్కువగా ఊహించుకుని రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది నాయకులు. ఇప్పుడు ఈ జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. కీలక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గారి వ్యవహార శైలి కొంత పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది అనే కామెంట్స్ వినపడుతున్నాయి. రాజకీయంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి వ్యవహారాలపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకోవడం లేదనే ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమౌతోంది.
Also Read : శ్రీవారి భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..!
కూటమి పార్టీలతో కూడా ఎమ్మెల్యే గారికి పెద్దగా సత్సంబంధాలు లేవు. ఎప్పుడు ఏం మాట్లాడతారు అర్థం కాక స్థానిక నాయకత్వం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఓవైపు కొలికపూడి వ్యవహారంతో ఇబ్బంది పడుతున్న పార్టీకి.. ఈయన కూడా కొంత తలనొప్పిగా మారారు. అటు అధిష్టానానికి చెబుదామంటే.. ఎమ్మెల్యే గారి కక్ష సాధింపు ఎక్కువ అవుతుందేమోనని భయం కొంతమంది స్థానిక నాయకుల్లో వ్యక్తం అవుతుంది. 2024 ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించిన సదరు ఎమ్మెల్యే గారు.. నియోజకవర్గంలో తన సొంత వర్గాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి పెద్దగా ఫలించకపోవడంతో.. తన బలాన్ని చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయిలో కొత్త స్టేడియాలు..!
స్థానిక ఎంపీ గారితో గతంలో విభేదాలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు వాటిని సరిచేసుకుని ముందుకు వెళుతున్న సరే.. ఎమ్మెల్యే గారు మాత్రం ఎవరైనా సరే తన దగ్గరకు రాజీకి రావాల్సిందే అనే సంకేతాలు ఇస్తున్నారట. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే గారి బిహేవియర్.. ఇప్పటి ప్రవర్తనకు చాలా తేడా ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులు కూడా ఎమ్మెల్యే గారు చేయడం లేదని.. కనీసం ఉద్యోగాల కోసం వెళితే కార్యకర్తలను పట్టించుకోవడంలేదని.. వసూళ్ల విషయంలో కూడా ఎమ్మెల్యే గారి దూకుడు కాస్త ఎక్కువగానే ఉందనేది పార్టీ క్యాడర్ లో ఎక్కువగా వినపడుతున్న మాట. అయితే ఈయనపై పార్టీ అధిష్టానం కూడా కొంత దృష్టి సారించి.. ఇప్పటికే కొన్ని నివేదికలు కూడా తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.

