Sunday, March 22, 2026 12:10 PM
Sunday, March 22, 2026 12:10 PM

బాబోయ్ సిగరెట్ రేట్లు

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. పొగాకు వినియోగం తగ్గించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటం పూర్తిగా నిషేధం. రైళ్లు, బస్సుల్లో ధూమపానం చేస్తే భారీగా జరిమానా విధిస్తున్నారు కూడా. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసిన వారికి 200 నుంచి 500 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు కూడా. ఇక ప్రముఖ సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ కూడా ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి పెట్టింది. సిగరెట్ తయారీ కంటే.. ఆశీర్వాద్, సన్ ఫీస్ట్, బింగో, యప్పీ వంటి ఉత్పత్తులతో పాటు రెడీ టూ ఈట్ కిచెన్స్ ఆఫ్ ఇండియా, న్యాచురల్ జ్యూస్, చాక్లెట్స్ తయారీపై ఎక్కువగా దృష్టి పెట్టింది. అలాగే ఐటీసీ బోర్డు హోటల్స్, పేపర్ తయారీ రంగాలపై కూడా ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది.

Also Read  : బ్రేకింగ్: గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్..!

ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో పొగాకు సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. పొగాకు రైతులు సుబాబుల్, గోధుమ, మిర్చి, పత్తి పంటల సాగు పై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. ఆ పంటలను కూడా ఐటీసీ కొనుగోలు చేసి పేపర్, గోధుమ పిండి, కారం వంటి గృహ వినియోగ వస్తువుల కోసం వినియోగిస్తోంది. ఇదే సమయంలో సిగరెట్ ధరను కేంద్రం క్రమంగా పెంచుతూ వస్తోంది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 2 రూపాయలు ఉన్న సిగరెట్.. ఇప్పుడు 18 రూపాయలకు చేరుకుంది. ధరలు పెరిగితే.. వినియోగం తగ్గుతుందనేది కేంద్రం భావన. అందుకే పన్నుల భారం మోపుతోంది.

Also Read  : సోషల్ మీడియా వాడకపోతే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..?

తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌లో పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ మోత మోగించేందుకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ… బీడీలపై 18 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ విధించనున్నట్లు సమాచారం. జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ ట్యాక్స్‌తో సిగరెట్, బీడీ ధరలు భారీగా పెరగనున్నాయి. జీఎస్టీ, సెస్‌తో పాన్ మసాలా ధరలు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం 18 రూపాయలుగా ఉన్న ఒక్క సిగరెట్ ధర.. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి 72 రూపాయలకు పెరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పొగ రాయుళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు మద్యం ధరలు తగ్గిస్తుంటే.. సిగరెట్, బీడీ ధరలు పెంచటం ఏమిటని నిలదీస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్