Monday, June 22, 2026 06:26 PM
Monday, June 22, 2026 06:26 PM

వందేభారత్ స్లీపర్ ముహుర్తం ఫిక్స్.. ఆ రూట్‌లోనే..!

భారతీయులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. భారతీయ రైల్వే శాఖ మరో మైలురాయి అధిగమించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కేందుకు ముహుర్తం ఖరారైంది. అందరూ ఊహించినట్లుగా కొత్త ఏడాది తొలి రోజుల్లోనే వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టనుంది. అయితే అందరూ ముుందుగా ఊహించినట్లు ఢిల్లీ – పాట్నా మధ్య కాకుండా… ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రైలు పట్టాలెక్కనుంది. నూతన సంవత్సరం తొలి రోజున రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ రైలు గురించి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రైలులో ఉండే సౌకర్యాలను కూడా అశ్వనీ వైష్ణవ్ వివరించారు. తొలి రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.

Also Read : చంద్రబాబు నాయుడు – గ్రీన్‌ఫీల్డ్ ఆర్కిటెక్ట్

భారతీయ రైల్వే వ్యవస్థలో వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. సెమీ హై స్పీడ్ రైళ్లుగా వందే భారత్‌ను రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే వందేభారత్ సీటింగ్ రైళ్లు ప్రధాన పట్టణాల మధ్య పరుగులు పెడుతున్నాయి. అయితే ఈ రైళ్లు అన్నీ పగలు మాత్రమే నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ – విశాఖ, నరసాపురం – చెన్నై, సికింద్రాబాద్ – తిరుపతి, సికింద్రాబాద్ – యశ్వంతపూర్, సికింద్రాబాద్ – నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభారత్ రైలు పరుగులు పెడుతోంది. అయితే ఈ రైళ్లు పూర్తిగా సీటింగ్‌తో పాటు పగలు మాత్రమే నడుస్తున్నాయి. వీటి వల్ల 8 గంటల ప్రయాణం మొత్తం కూర్చునే చేయాల్సి వస్తుంది. దీని వల్ల పెద్ద వాళ్లు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రయాణీకులు ఎదురు చూస్తున్నారు. దీంతో స్లీపర్ రైళ్లను ఇప్పటికే పలుమార్లు ప్రయోగాలు చేసి.. మార్పులు చేర్పులు చేసి ముహూర్తం ఖరారు చేశారు.

Also Read : బర్డ్ ఫ్లూ రీ ఎంట్రీ..? కాని అక్కడే..!

తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. తొలి రైలు కొల్‌కతా – గౌహతి మధ్య నడుస్తుందన్నారు. జనవరి 17 లేదా 18 తేదీల్లో ఈ రైలు అధికారికంగా ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. గౌహతి – హౌరా మధ్య వందే భారత్ స్లీపర్ రైలులో 3ఏసీలో రూ.2,300, సెంకడ్ ఏసీలో రూ.3,000, ఫస్ట్ ఏసీలో రూ.3,600.. భోజనంతో కలిపి టికెట్ ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. వందే భారత స్లీపర్ రైలు 180 కిలోమీటర్ల వేగంతో ట్రైల్ రన్ నిర్వహించినట్లు అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. హై సస్పెన్షన తో ఈ రైలు రూపొందించినట్లు తెలిపిన అశ్వనీ వైష్ణవ్.. ప్రయాణీకుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ప్రతి కోచ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందే భారత్ రైలులో మాదిరిగానే స్లీపర్‌లో కూడా ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యాలు, రక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే మరిన్ని మార్గాల్లో కూడా వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభిస్తామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

సాయి కృష్ణ కేసులో...

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో...

పవన్ కు ఆ...

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్...

పోల్స్